పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. ఆఫీస్ కూడా ప్రారంభమైంది.. డైరెక్టర్, నిర్మాత ఎవరంటే?

Published : Sep 01, 2023, 06:57 PM IST
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. ఆఫీస్ కూడా ప్రారంభమైంది.. డైరెక్టర్, నిర్మాత ఎవరంటే?

సారాంశం

పవర్ స్టార్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది.  పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన ఆఫీస్ ఈరోజు ప్రారంభమైంది. ఈ మూవీకి సంబంధించి వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.   

ఒకవైపు సినిమా షెడ్యూల్స్.. మరోవైపు పొలిటికల్ కార్యక్రమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్ట్రిక్ట్ షెడ్యూల్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న OG, హరీశ్ శంకర్ కాంబోలో రెండోసారి నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. 

ఇక రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉండటంతో పవన్ ఫ్యాన్స్ కు వరుసగా సర్ ప్రైజ్ లు అందుతున్నాయి. తాజాగా పవన్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ అందింది. సురేందర్ రెడ్డి దర్శకుడిగా SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాత రామ్ తళ్లూరి ఓ సినిమాను  నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం పవన్ ఓకే చెప్పడంతో సినిమా పనులపై టీమ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈకొత్త సినిమా ఆఫీస్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సురేందర్ రెడ్డి - పవన్ కళ్యాణ్ కాంబోలో ఇది తొలిచిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమా పనులు షురూ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే... రేపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల నుంచి సూపర్ అప్డేట్స్ రాబోతున్నాయి. అలాగే పవన్ కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిన ‘గుడుంబా శంకర్’ కూడా రీరిలీజ్ కానుంది. మొత్తానికి రేపు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగనే చెప్పాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌