నెటిజన్ తిక్క ప్రశ్న.. షారుఖ్ ఖాన్ షాకింగ్ ఆన్సర్, ఇచ్చిపడేశాడుగా..

Published : Sep 05, 2023, 08:59 AM ISTUpdated : Sep 05, 2023, 09:30 AM IST
నెటిజన్ తిక్క ప్రశ్న.. షారుఖ్ ఖాన్ షాకింగ్ ఆన్సర్, ఇచ్చిపడేశాడుగా..

సారాంశం

ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంటె నెటిజన్ల చిలిపి ప్రశ్నలకు చిరాకోచ్చేస్తోంది స్టార్స్ కు. దాంతో గట్టిగా కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కు ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఆయన ఏం చేశారంటే..? 

ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంటె నెటిజన్ల చిలిపి ప్రశ్నలకు చిరాకోచ్చేస్తోంది స్టార్స్ కు. దాంతో గట్టిగా కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కు ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఆయన ఏం చేశారంటే..? 

రీ ఎంట్రీలో జోరు చూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). జీరో సినిమా డిజాస్టర్ అయిన తరువాత నాలుగైదేళ్లు సినిమాలకుగ్యాప్ ఇచ్చాడు షారుఖ్. ఈ గ్యాప్ లో.. షారుఖ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక ఈమధ్య పటాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్.. ప్లప్ ల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ కు ఊపిరులూదారు. ఈక్రమంలో ఆయన తాజాగా జవాన్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈసినిమాతో ఈసారి సౌత్ ను టార్గెట్ చేశారు షారుఖ్. 

షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan)తాజా చిత్రం జవాన్‌ సెప్టెంబర్‌ 7న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక కుర్రకారును మించి హ్యాండ్సమ్ నెస్ తో.. దూసుకుపోతున్నాడు షారుఖ్. 60కి చాలా దగ్గరలో ఉన్న స్టార్ హీరో.. సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆనంద్ మహేంద్రనే షారుఖ్ ఖాన్ ఏం తింటున్నాడు.. యంగ్ హీరోలా మెరిసిపోతున్నాడు అని అన్నారంటే ఆయన డెడికేషన్ అర్ధం అవుతోంది. 

ఇక ఈమధ్య ఆయనకు సోషల్ మీడియాలో వింత వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఫ్యాన్స్ తో ఎప్పుడూ చిట్ చాట్ చేసే షారుఖ్ ఖాన్ ను కొంత మంది నెటిజన్లు .. వింత ప్రశ్నలతో ఆడేసుకుంటున్నారు. ఇబ్బంది పెడుతున్నారు. గతంలో నయనతారకు పడిపోయారా అంటూ..ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గట్టిగా బదులిచ్చాడు బాలీవుడ్(Bollywood) బాద్ షా. అంతే  కాదు గతంలో  కొంత మంది పిచ్చి ప్రశ్నలకు కూడా డిఫరెంట్ గా సమాధానం చెప్పాడు. ఇక తాజాగా  మరోసారి షారుఖ్ ను రెచ్చగొట్టే పని చేశాడు ఓ నెటిజన్. 

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ సైతం జవాన్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా కోసం  సోషల్ మీడియాలో మాట మంతి కార్యక్రమం నిర్వహించారు షారుఖ్. ఇందులో ఆయనక వింత వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఎవరు ఏమడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పారు షారుఖ్ ఖాన్. అయితే ఇందులో భాగంగా మరో సాంఘిక మాధ్యమంలో మాటామంతి నిర్వహించారు. ఇందులో అభిమానులడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు.

ఇదిలావుంటే.. ఈ మాటామంతి కార్యక్రమంలో ఓ యువకుడు షారుఖ్‌ని జవాన్‌ టికెట్లు ఫ్రీగా కావాలని అడిగాడు. ఉచితంగా రెండు టికెట్లిప్పిస్తే తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకెళ్తానని చెప్పాడు. దాంతో మన కింగ్‌ఖాన్‌కి చిర్రెత్తుకొచ్చింది. ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమోగానీ.. టికెట్లు ఫ్రీగా దొరకవ్‌ బ్రదర్‌.. టికెట్‌ కావాలంటే పైసల్‌ పెట్టాల్సిందే. రొమాన్స్‌ కూడా ఛీప్‌గా దొరికేయాలంటే ఎలా?.. వెళ్లి డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కొని, నీ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లు. ఇద్దరూ సినిమా చూసి ఎంజాయ్‌ చెయ్యండి.. అంటూ చురకలంటించారు షారుఖ్‌.

షారుఖ్ ఖాన్ కు చిర్రొత్తుకొచ్చి.. ఆయన వేసిన సెటైర్ బాగా పనిచేసింది. లాజికల్ గా సమాధానం చెప్పి..నోరు మూయించాడు బాద్ షా. ఈ విషయంలో.. నెటిజన్లు కూడా షారుఖ్ ఖాన్ ను సపోర్ట్ చేస్తున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 
   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌