AbRam Khan : షారుఖ్ ఖాన్ ఐకానిక్ ఫోజులో కొడుకు.. వైరల్ గా మారిన వీడియో..

Published : Dec 23, 2023, 04:55 PM ISTUpdated : Dec 23, 2023, 04:59 PM IST
AbRam Khan :  షారుఖ్ ఖాన్ ఐకానిక్ ఫోజులో కొడుకు.. వైరల్ గా మారిన వీడియో..

సారాంశం

షారుఖ్ ఖాన్ కొడుకు అబ్రామ్ ఖాన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. స్కూల్ ఈవెంట్ లో భాగంగా స్టార్ కిడ్ చేసిన మొట్టమొదటి పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. తండ్రి నటనను గుర్తుచేసే గెశ్చర్స్ తో అదరగొట్టాడు. 

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)  చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్ (AbRam Khan) వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తన స్కూల్ లో వార్షికోత్సవం భాగంగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. దీంతో అబ్రామ్ ఖాన్ మొట్టమొదటిసారిగా స్టేజీ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తండ్రి ముందే ఇంగ్లీస్ నాటకంలో అద్భుతంగా నటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

కొడుకు నాటక ప్రదర్శనను చూసి తండ్రి షారుఖ్ ఖాన్ ఎంతగానో మురిసిపోయారు. సెల్ ఫోన్లో సన్నివేశాన్ని బంధించారు. అయితే కొద్దిరోజులు కింద జరిగిన ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. స్టార్ కిడ్ నటన, డైలాగ్ డెలివరీ, ఎలాంటి బెదురు లేకుండా, వేల మంది ముందు నాటకంలో లీనమై పోవడం వంటి అంశాలు ఆకట్టుకుంటున్నాయి. 

అలాగే తండ్రి షారుఖ్ ఖాన్ ఐకానిక్ ఫోజుతో స్టేజీ పెర్ఫామెన్స్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు షారుఖ్ ఖాన్ ఇచ్చిన రియాక్షన్ కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అబ్రామ్ కాన్ ప్రస్తుతం తన స్కూలింగ్ ను పూర్తి చేస్తున్నారు. అతని 11 ఏళ్లు ఉంటాయి. తరుచుగా సోషల్ మీడియా తండ్రి, తల్లితో కలిసి సందడి చేస్తూనే ఉంటాడు.

ఇదిలా ఉంటే.. షారుఖ్ ఖాన్ వరుస చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఏకంగా వరుసగా రెండు సినిమాలతో వేయ్యి కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘డంకీ’ (Dunki)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాజిటివ్ టాక్ దక్కింది. కొన్ని నెగెటివ్ రివ్యూ కూడా ఉన్నాయి. మొత్తానికి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Trisha Fitness: త్రిష అందం వెనుక ఇంత కష్టం ఉందా? 43 ఏళ్లలోనూ 20లా ఎలా?