
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసింది. ఆ వివాదం ఇంకా రన్ అవుతూనే ఉంది. ఫినాలే రోజు చోటు చేసుకున్న వివాదం కారణంగా ఏకంగా విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఆయన బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా తను జైలుకి వెళ్లాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ ఒక టీమ్‌గా ఉన్నారు. కలిసి గేమ్ ఆడారు. వీరికి స్పై బ్యాచ్ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఫినాలేలో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నపర్‌గా నిలిచాడు. శివాజీ మూడో స్థానానికే పరిమితమయ్యాడు. విన్నర్‌గా పోటీ ఇస్తాడనుకుంటే శివాజీ మూడే స్థానంలోనే ఎలిమినేట్ అయ్యాడు.
అయితే కానీ శివాజీ మాత్రం హౌజ్‌లో ఉన్నంత సేపు తన మార్క్ ని చూపించాడు. విన్నర్ కాకపోయినా కంటెస్టెంట్లని చాలా ప్రభావితం చేశాడు. ఛాణక్యగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాను ఈ స్థానంలో ఉండటానికి కారణం శివాజీ అన్ననే అని తెలిపారు యావర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాల్గో స్థానంలో యావర్ ఎలిమినేట్ అయ్యాడు. 15లక్షల ఆఫర్‌ని తీసుకుని హౌజ్‌ని వీడాడు.
తాజాగా యావర్ మాట్లాడుతూ, శివాజీ అన్న కారణంగానే తాను టాప్ 5లో నిలిచినట్టు చెప్పాడు. తాను ముందుగా అసలు టాప్ 5కి వస్తానని ఊహించుకోలేదని చెప్పారు. తనకు తెలుగు రాదు, మ్యానేజ్ చేయడం కష్టం, ఐదారు వారాల్లోనే ఎలిమినేట్ అవుతానని అనుకున్నా. కానీ శివాజీ అన్న ఎంతో హెల్ప్ చేశాడని తెలిపారు. తాను ఎంత స్ట్రాంగ్ అయిన మోరల్ సపోర్ట్ అవసరం, బూస్ట్ ఇచ్చేవాళ్లు కావాలి, మనలో కాన్ఫిడెంట్‌ని బిల్డ్ చేసే వాళ్లు కావాలి, అలా తనకు శివాజీ అన్న సపోర్ట్ చేశాడని, తాను ఇన్ని రోజులు సర్వైవ్ కావాలంటే ఆయనే కారణం అని తెలిపాడు యావర్.