
బాలీవుడ్ బాద్షా.. షారూక్ ఖాన్ కి తన పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. వీలు కుదిరినప్పుడల్లా వారికి సమయం కేటాయిస్తూ ఉంటారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ స్టార్ కూడా షారూక్ అని చెప్పవచ్చు. తన సినిమాలకు సంబంధించిన విషయాలు, తన పిల్లల ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ ఉంటారు. పేరుకి ముగ్గురు పిల్లల తండ్రి అయినా.. వారితో చంటి పిల్లాడిలా మారి అల్లరి చేస్తూ ఉంటారు.
తాజాగా తన కుమార్తె సుహానా(17) ముంబయిలోని దీరుభాయి అంబానీ ఇంటర్నేషన్ స్కూల్ లో చదువుతోంది. స్కూల్ కి ఎక్కువ రోజులు సెలవలు వస్తేనే అక్కడ ఇంటికి పంపుతారు. అలా గణేష్ ఉత్సవంలో భాగంగా ఇంటికి వచ్చిన సుహానా తిరిగి మళ్లీ స్కూలుకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తనను నవ్వించేందుకు షారూక్ సుహానాతో దిగిన ఫోటోని ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ ఫోటోలో కింద..‘ మా అమ్మాయి స్కూల్ కి వెళ్లాక చాలా ఫిల్టర్లు ఉపయోగించావు.. అని ఎవరూ అడగకకూడదు’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. పోస్టు చేసిన నాలుగు గంటల్లోనే 3,700 రీట్వీట్లు, 21 వేల లైకులు, 1700 కామెంట్లు వచ్చాయి.