Pathaan Trailer : యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ‘పఠాన్’ ట్రైలర్.. తెలుగు వెర్షన్ ను లాంచ్ చేసిన రామ్ చరణ్!

Published : Jan 10, 2023, 01:24 PM IST
Pathaan Trailer : యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ‘పఠాన్’ ట్రైలర్.. తెలుగు వెర్షన్ ను లాంచ్ చేసిన రామ్ చరణ్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’ నుంచి ట్రైలర్ విడుదలైంది. హిందీతో పాటు తెలుగులోనూ లో రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ ను తెలుగు వెర్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేయడం విశేషం.   

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహం ప్రధాన తారాగణం. చిత్రానికి ఆనంద్ కథ, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కాగా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. 

ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. హిందీలో రూపుదిద్దుకుంటున్న మూవీని తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. కాగా, ట్రైలర్ ను కూడా ఆయా భాషల్లో వదిలారు.  తెలుగు వెర్షన్ ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లాంచ్ చేసి, పఠాన్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్ ఖాన్ మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో కనిపించబోతున్నారని, ఆ అద్భుతాన్ని తానూ చూడాలని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. 

ఇక ట్రైలర్ విషయానికిస్తే.. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెల్స్ తో షారుఖ్ నెవెర్ బిఫోర్ పెర్ఫామెన్స్ కనిపిస్తోంది. ట్రైన్ లో, గాల్లో చిత్రీకరించిన ఫైట్స్ సీన్స్ ప్రధానంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ‘ఒక సైనికుడు దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అనే ఆలోచిస్తాడు’ అంటూ షారుఖ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీపికా గ్లామర్ తోపాటు ఫైట్స్ లోనూ దుమ్ములేపనుందని అర్థమవుతోంది. మొత్తానికి యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ దూసుకుపోతోంది. 

అయితే, ‘పఠాన్’ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. మొదట విడుదలైన ‘బేషరమ్ రంగ్’ సాంగ్ తో సినిమాపై భారీ ఎత్తుకున్న వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. దీపికా పదుకునే ధరించి వస్త్రాలపై  హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సినిమాను బాయ్ కాట్ చేయాలని నెట్టింట డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జనవరి 25న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ఇప్పుడు ప్రియదర్శితో రొమాన్స్.. దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ, వైరల్ ఫొటోస్