Kantara: ఆస్కార్‌ బరిలో `కాంతార`.. రెండు విభాగాల్లో అవార్డు కోసం పోటీ..

Published : Jan 10, 2023, 12:10 PM ISTUpdated : Jan 10, 2023, 12:17 PM IST
Kantara: ఆస్కార్‌ బరిలో `కాంతార`.. రెండు విభాగాల్లో అవార్డు కోసం పోటీ..

సారాంశం

కన్నడ సంచలనం `కాంతార` మూవీ మరో సంచలనం సృష్టించబోతుంది. ఈ సినిమా ఆలస్యంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. తాజాగా నిర్మాణ సంస్థ ప్రకటించింది.  

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్‌ మూవీ ఆస్కార్‌ పోటీలోకి దూసుకొచ్చింది. ఇటీవల కన్నడ కన్నడ సంచలనం `కాంతార` మూవీ ఆస్కార్‌ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ సినిమా అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. 

`కాంతార` చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్కి అర్హత లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు. మీ అందరి మద్దతుతో ఈ ప్రయాణాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఇది మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. అందుకోసం ఆతృతగా ఉన్నాం` అని పేర్కొంది నిర్మాణ సంస్థ. ఇది ఉత్తమ నటుడు, మూవీ విభాగంలో ఆస్కార్‌కి పంపించబడిందని తెలుస్తుంది. 

ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ ఆస్కార్‌ బరిలో ఉంది. ఇది ఒరిజినల్‌ సాంగ్‌(నాటు నాటు), ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్‌ కోసం పోటీ పడుతుంది. అయితే ఈ నెలలో ఆస్కార్‌ నామినేషన్లు ఫైనల్‌ అవుతాయి. ఈ నామినేషన్లలో మన సినిమాలు నామినేట్‌ అయితే ఇక డైరెక్ట్ గా ఆస్కార్‌ అవార్డు కోసం పోటీలో ఉన్నట్టు. ఇండియన్‌ సినిమాకి ఆస్కార్ అనే కల ఇన్నాళ్లకైనా తీరుతుందా అనేది ఉత్కంఠగా మారింది. 

`కాంతార` చిత్రాన్ని దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి నటిస్తూ రూపొందించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత పది రోజులకు ఇతర భాషల్లో డబ్‌ అయ్యింది. తెలుగులోనూ విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేయడం విశేషం. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది, అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది `కాంతార`. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?