వైష్ణోదేవి ఆలయాంలో షారుఖ్ ఖాన్ , ఆధ్యాత్మిక సేవలో బాలీవుడ్ బాద్ షా

Published : Dec 12, 2022, 03:23 PM ISTUpdated : Dec 12, 2022, 03:24 PM IST
వైష్ణోదేవి ఆలయాంలో షారుఖ్ ఖాన్ , ఆధ్యాత్మిక  సేవలో బాలీవుడ్ బాద్ షా

సారాంశం

ఈ మధ్య ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. దైవర దర్శనాలు చేసుకుంటున్నాడు. ఈ మధ్య ఎక్కువగా సమస్యల వలయంలోచిక్కుకున్న స్టార్ హీరో.. ఈమధ్యే వాటి నుంచి కాస్త బయట పడుతున్నాడు.   

వరుస ప్లాప్ లు, డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఇబ్బందులు, ఇలా రకరకాల ఇబ్బందులు పడ్డాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఇప్పుడిప్పుడు అన్నింటి నుంచి కోలుకుంటున్నాడు. ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇవ్వడం. వరుస సినిమాలలో షారుఖ్ ఖాన్ నటించడం ఇలా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. 2018 రిలీజ్ అయిన జీరో ప్లాప్  తరువాత షారుఖ్ కు సినిమాలు లేవు.  

ఇక సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతుండటం.. తన సినిమాలు రిలీజ్ కు ఉండటంతో... మొక్కులు చెల్లించుకుంటున్నాడో ఏమో షారుఖ్ ఖాన్ వరుసగా ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శిస్తున్నాడు. షారుక్ ఖాన్‌ తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

కాగా రీసెంట్ గా షారుఖ్  సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  గెటప్ కూడా వైరల్ అయ్యింది. అక్కడ ప్రత్యేక ప్రార్ధణలు, గుళ్ళో కూడా ప్రత్యేక పూజలు చేస్తుండటంతో.. షారుఖ్ ఏమైన మెక్కున్నారేమో... మొక్కులు తీర్చుకుంటున్నాడేమో అని అంటున్నారునెటిజన్లు.   ఏది ఏమైనా షారుఖ్ ఆధ్యాత్మిక సేవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

షారుఖ్ ఖాన్  ప్రస్తుతం పఠాన్‌ , జవాన్‌, డంకీ  సినిమాలు చేస్తున్నాడు. ఒకదానికి ఒకటి సంబధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఈ మూవీస్ తెరకెక్కుతున్నాయి. భారీ బడ్జెట్‌ తో ఈసినిమాలు రూపొందుతున్ాయి.  ఇక షారుఖ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా పఠాన్‌ మాత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకులను అలరించనుంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జాన్‌ అబ్రహం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ