కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన షారూఖ్‌ నటి శిఖా మల్హోత్రా

Published : Dec 15, 2020, 11:36 AM IST
కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన షారూఖ్‌ నటి శిఖా మల్హోత్రా

సారాంశం

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `ఫ్యాన్‌` సినిమాలో కీలక పాత్రలో నటించింది నటి శిఖా మల్హోత్రా. ఆమె ఇటీవల కరోనాకు గురైంది. కరోనా రోగులకు సేవలందిస్తూ వైరస్‌ బారిన పడ్డారు. ఎట్టకేలకు దాన్నుంచి కోలుకున్నారు. మహమ్మారితో పోరాడి ఇటీవల ఇంటికి చేరుకున్న ఆమెని మరో రోగం వెంటాడింది. 

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `ఫ్యాన్‌` సినిమాలో కీలక పాత్రలో నటించింది నటి శిఖా మల్హోత్రా. ఆమె ఇటీవల కరోనాకు గురైంది. కరోనా రోగులకు సేవలందిస్తూ వైరస్‌ బారిన పడ్డారు. ఎట్టకేలకు దాన్నుంచి కోలుకున్నారు. మహమ్మారితో పోరాడి ఇటీవల ఇంటికి చేరుకున్న ఆమెని మరో రోగం వెంటాడింది. ఆమె పక్షవాతానికి గురైంది. ఈ విషయాన్ని ఆమె మేనేజన్‌ అశ్విన్‌ శుక్లా వెల్లడించారు. 

`శిఖా పక్షపాతానికి గురయ్యారు. ఆమెకి కుడివైపు స్ట్రోక్‌ వచ్చింది. ప్రస్తుతం శిఖా.. కూపర్‌ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నార`ని తెలిపాడు. ఈ మేరకు ఆమె ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఫోటోని పంచుకున్నారు. దీంతో ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకుని తిరిగి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే శిఖా నటిగానే కాదు, వైద్య విద్యార్థినిగా ఉంది. తనకిష్టమైన సినీ రంగంలో రాణించాలని తాపత్రయపడుతుంది. నర్సుగా ఆమె కరోనా రోగులకు సేవలందిస్తున్న క్రమంలో కరోనాకి గురైన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకుని ఇప్పుడు పక్షవాతానికి గురికావడం బాధాకరం. ఆమె షారూఖ్‌ నటించిన `ఫ్యాన్‌` చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరికి ఆకట్టుకుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్