పెళ్ళి తర్వాత సినిమా అవకాశాలు వస్తాయనుకోలేదుః సమంత భావోద్వేగం

Published : Dec 15, 2020, 10:29 AM IST
పెళ్ళి తర్వాత సినిమా అవకాశాలు వస్తాయనుకోలేదుః సమంత భావోద్వేగం

సారాంశం

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మ్యారేజ్‌ తర్వాత సినిమాలు చేస్తానని అనుకోలేదట.

`మ్యారేజ్‌ తర్వాత నాకు సినిమా అవకాశాలు వస్తాయని అస్సలు ఊహించలేదు. హీరోయిన్‌గా ఛాన్స్ లు వస్తాయనుకోలేద`ని అంటోంది సమంత. తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంత.. ప్రేమించి అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మ్యారేజ్‌ జరిగి మూడేళ్ళు పూర్తయ్యింది. ఆ తర్వాత `మహానటి`, `రంగస్థలం`, `సూపర్‌ డీలక్స్`, `ఓ బేబీ`, `జాను` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్‌ బెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. 

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మ్యారేజ్‌ తర్వాత సినిమాలు చేస్తానని అనుకోలేదట. `నిజంగా నాకు అదృష్టం ఎక్కువే. పెళ్ళి తర్వాత కూడా నేను వరుసగా మంచి చిత్రాల్లో కూడా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోవాలనో నేనేం ప్లాన్‌ చేయలేదు. అదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. 

మ్యారేజ్‌ తర్వాత `రంగస్థలం` వంటి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా `మహానటి`, `ఓ బేబీ` వంటి చిత్రాలు వచ్చాయి. ఇంకా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయ`ని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది `జాను` చిత్రంలో నటించిన సమంత  ఆ తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయలేదు. దీంతో ఇక ఆమె సినిమాలు మానేసినట్టేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి