షారుఖ్ ఖాన్ చేసిన పనికి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన అభిమాని..

By Mahesh Jujjuri  |  First Published Jan 31, 2024, 11:27 AM IST

ఓ అభిమానిచేత కన్నీళ్లు పెట్టించాడు బాలీవుడ్ బాద్షా.. కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్.  స్టార్ హీరో ముందే బోరున విలపించాడు అభిమాని.ఇంతకీ షారుఖ్ ఏం చేశాడు.. అభిమానిఎందుకు ఏడ్చాడు. 

Shah Rukh Khan Gives Warm Hug To Fan Who Cried Upon Meeting Him At Event, Kisses His Forehead JMS

దాదాపు నాలుగేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. వరుస ఫెయిల్యూర్స్ తో  అతని పని అయిపోయింది అన్నవారు కూడా ఉన్నారు. కాని నాలుగేళ్ల నరకం తరువాత పడిపోతున్న బాలీవుడ్ ను తన రీ ఎంట్రీతో గట్టెక్కించాడు బాద్షా. బాలీవుడ్ కు తానే కింగ్ అని నిరూపించాడు. వరుసగా మూడు సినిమాలు.. హ్యాట్రిక్ విజయం ఒకవైపు.. బాలీవుడ్ లో ఆ మూడు సినిమాలు రికార్డ్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు. షారుఖ్ నటించిన మూడు సినిమాల్లో పఠాన్, జవాన్, డంకీ సినిమాలు హిట్ అయ్యి బీ టౌన్ ను కూడా నిలబెట్టాయి. 

పఠాన్, జవాన్ సినిమాలు చెరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను తమ ఖాతాలో వేసుకోగా.. డంకీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వెయ్యి కోట్ల మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సందర్భంగా షారుక్ ఖాన్ తన అభిమానులతో సమావేశమయ్యారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చాట్ చేసే షారుఖ్.. ఈసారి డైరెక్ట్ గా ఫ్యాన్స్ మీట్ ను ఏర్పాటు చేశాడు.  ఈ కార్యక్రమం యశ్ రాజ్ స్టూడియోలో జరిగింది . ఈ సందర్బంగా షారూఖ్ ఖాన్ ఒక అభిమానిని ప్రేమతో కౌగిలించుకుని ముద్దాడాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కౌగిలింత అందుకున్న అభిమాని కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. బోరున ఏడ్చేశాడు. 

Latest Videos

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SRK VIBE (@_srkvibe2.0)

ఆ వ్యక్తి  షారుక్‌ కు వీరాభిమాని... తన అభిమాన స్టార్ ను కలవాలనేది చాలా మంది అభిమానుల కల. ఈ కల ఆ అభిమానికి నెరవేడం.. దాంతో పాటు షారుఖ్ స్వయంగా హగ్ ఇచ్చి ముద్దు పెట్టడంతో తట్టుకోలేకపోయాడు ఆఫ్యాన్. అభిమానులందరికి తాము ప్రేమించే స్టార్ ను కలవాలి అని ఉంటుంది. కాని అన్నివేళలా.. అందరుస్టార్స్ ను కలిసే అవకాశం ఉండదు. హీరోల బిజీ షెడ్యుల్ తో పాటు.. సెక్యూరిటీ రీజన్ తో వారు ప్యాన్స్ ను డైరెక్ట్ గా కలవరు. కాని షారుఖ్ వాటన్నింటిని బ్రేక్ చేసి.. తమ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.. ఒక రకంగా సంతోషాన్ని ఇచ్చాడు. 

షారుక్ ఖాన్ ఎంతో చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. గతంలో చాలా కష్టాలు పడ్డ స్టార్ హీరో.. బాలీవుడ్ లో తిరిగి తన స్థానం పొందడం.. దానికి కారణం తన సినిమాలను ఆదరించిన అభిమానులే కావడంతో.. షారుఖ్ ఇలా కృతజ్ఞత తీర్చుకున్నాడు అని అనుకుంటున్నారు అంతా.  జాలీ మూడ్ లో కనిపించిన షారుఖ్ ఖాన్..  తన అభిమానులను ఉద్దేశించి ఇష్టపూర్వకంగా మాట్లాడాడు. షారూఖ్‌తో మాట్లాడేందుకు ఓ అభిమాని వేదికపైకి వచ్చాడు. ఈసారి షారుక్ హగ్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానికి ఏం చేయాలో తోచలేదు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు. 

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image