#HanuManRAMpage :‘హనుమాన్’3D వెర్షన్ ప్లానింగ్, రిలీజ్ ఎప్పుడంటే

By Surya PrakashFirst Published Jan 31, 2024, 9:02 AM IST
Highlights

 నార్త్ లో కూడా సమ్మర్ లో భారీ ఎత్తున ఈ సినిమా త్రీడి వెర్షన్ కు  వెయ్యికి పైగా స్క్రీన్లతో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం.  

సంక్రాంతికి ఉన్న తీవ్రమైన పోటీ, ఫోస్ట్ ఫోన్ చేసుకోమనే ఒత్తిడి మధ్య హనుమాన్ వచ్చిన గెలిచింది. ఈ సినిమాకు మైత్రి అండ దొరకటం చాలా వరకూ కలిసి వచ్చింది. నైజామ్ హక్కులను సుమారు ఏడు కోట్ల ఇరవై లక్షలకు ఆ సంస్థ స్వంతం చేసుకుని మూడు నాలుగు రెట్లు మంచి లాభాలనే చూసినట్లు ట్రేడ్ టాక్.  అంతేకాకుండా గుంటూరు కారం మాస్ ని తట్టుకుని నిలబడటం అనేది హైలెట్ గా నిలిచింది.  ఇప్పుడు హనుమాన్ థియేటర్ రన్ క్లోజింగ్ కు ఇంక దగ్గరపడే సమయం. వీకెండ్ లు హౌస్ ఫుల్స్ అవుతూండటం అందరినీ ఆశ్చర్చంలో పడేస్తోంది. అయితే ఇదే సమయంలో ఆ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ ఆ ర్యాంపేజ్ ని కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా దర్శక,నిర్మాతలు మరో ప్లాన్ చేసారు. 

 ఈ ఫాంటసీ డ్రామా కూడా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఆధారపడి రూపొందింది. ఈక్రమంలో  త్రీడి వెర్షన్ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఆల్రెడీ చూసిన సినిమా మరోసారి చూస్తారా అంటే నిర్మాతల వైపు నుంచి ఉన్న ధైర్యం వెనుక మరో కోణం ఉంది. ఈ సినిమా త్రీడి వెర్షన్ ని సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ  చూసినవాళ్లు ఖచ్చితంగా పిల్లలకు మరోసారి చూడటానికి  రికమండ్ చేసే స్థాయిలో త్రీడిలో వచ్చే  విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ నమ్మకంతోనే నార్త్ లో కూడా సమ్మర్ లో భారీ ఎత్తున ఈ సినిమా త్రీడి వెర్షన్ కు  వెయ్యికి పైగా స్క్రీన్లతో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం.  వేసవి శెలవల్లో అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా చూడని వాళ్లు, చూసిన వాళ్లు మళ్లీ చూసే అవకాసం ఉంది.  

Latest Videos

 తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.    హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. 

click me!