Bigg Boss 15 ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన రతీ పాండే.. కారణమిదే..

Published : Oct 01, 2021, 07:12 PM IST
Bigg Boss 15 ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన రతీ పాండే.. కారణమిదే..

సారాంశం

బిగ్‌ బాస్‌ 15(Bigg Boss 15) సీజన్‌లో రతీ పాండే పాల్గొంటుందని, ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో దీనిపై నటి రతీ పాండే స్పందించింది. తనకు ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అని పేర్కొంది. 

హిందీ బిగ్‌ బాస్‌ 15 (Bigg Boss 15)ని మరో నటి తిరస్కరించింది. ఇప్పటికే (లేట్‌) సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి ఈ ఆఫర్‌ని తిరస్కరించింది. దాదాపు అరకోటి వరకు ఆమెకి ఇచ్చేందుకు బిగ్‌ బాస్‌ నిర్వహాకులు సంప్రదించగా, రియా నో చెప్పేసింది. మరో హిందీ టీవీ నటి, `షాదీ ముబారక్‌` సీరియల్‌ ఫేమ్‌ రతీ పాండే సైతం ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట. 

అయితే బిగ్‌ బాస్‌ 15 సీజన్‌లో రతీ పాండే పాల్గొంటుందని, ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో దీనిపై నటి రతీ పాండే స్పందించింది. తనకు ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అని పేర్కొంది. `అవును బిగ్‌ బాస్‌ 15 హౌజ్‌లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది. కానీ నాకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సారి హౌజ్‌లోకి వెళ్లలేకపోతున్నా. ఈ షోలో తాను పాల్గొంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు` అని పేర్కొంది రతీ పాండే. 

ఆమె ఇంకా చెబుతూ, `నేను బిగ్‌ బాస్‌ చూడటం ఇష్టపడతాను. గతంలోని సీజన్లని కూడా ఫాలో అయ్యాను. కానీ నేను అందులో ప్రదర్శన చేస్తానా లేదా అనే విషయం కచ్చితంగా తెలియదు` అని తెలిపింది. రతీ చివరగా హిందీలో `షాదీ ముబారక్‌` సీరియల్‌లో మెరిసింది. వీటితోపాటు `సీఐడీ`, `రాత్‌ హోనే కో హై`, `మిలే జబ్‌ హమ్‌ తుమ్‌`, `హిట్లర్‌ దీదీ`, `కామెడీ సర్కస్`, `దేవీ ఆది పరాశక్తి` వంటి సీరియల్స్ లో నటించి పాపులర్‌ అయ్యింది రతీ పాండే. `బిగ్‌ బాస్‌ 6`లో ఆమె డాన్స్ కూడా చేయడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌