MAA Elections: చక్రం తిప్పుతున్న మోహన్ బాబు.. కుమారుడి గెలుపు కోసం రంగంలోకి, సూపర్‌స్టార్ కృష్ణతో భేటీ

Siva Kodati |  
Published : Oct 01, 2021, 05:47 PM ISTUpdated : Oct 01, 2021, 05:51 PM IST
MAA Elections: చక్రం తిప్పుతున్న మోహన్ బాబు.. కుమారుడి గెలుపు కోసం రంగంలోకి, సూపర్‌స్టార్ కృష్ణతో భేటీ

సారాంశం

సీనియర్ హీరో, సూపర్‌స్టార్ కృష్ణను ప్రముఖ నటుడు మోహన్ బాబు కలిశారు. మా ఎన్నికల్లో తన తనయుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నందున తమకు మద్ధతు ప్రకటించాలని మోహన్ బాబు కోరారు. అలాగే మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్‌కు ఓటేయాలని కృష్ణను మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. 

సీనియర్ హీరో, సూపర్‌స్టార్ కృష్ణను ప్రముఖ నటుడు మోహన్ బాబు కలిశారు. మా ఎన్నికల్లో తన తనయుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నందున తమకు మద్ధతు ప్రకటించాలని మోహన్ బాబు కోరారు. అలాగే మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్‌కు ఓటేయాలని కృష్ణను మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణ... మంచు విష్ణుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

అక్టోబర్‌ 10న `మా` ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రెండు నెలల నుంచే పోటీలో ఉన్న వారు ప్లానింగ్‌తో, స్ట్రాటజీలతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోటీ రసవత్తరంగా మార్చేశారు. అయితే ప్రస్తుతం `మా` అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. వీరితోపాటు సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నారు. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు ఇప్పటికే తమ ప్యానెల్‌లను ప్రకటించారు. 

ALso Read:పవన్‌ దెబ్బకి మారిన `మా` లెక్కలు.. మంచు విష్ణు గెలుపు ఖాయమేనా?.. ఒంటరైనా మెగా ఫ్యామిలీ?

ప్రకాష్‌రాజ్‌ వైపు మెగా ఫ్యామిలీ ఉందని, ప్రముఖులంతా ఆయన వెంటే ఉన్నారనే టాక్‌ వినిపించింది. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ గెలుపు ఖాయమనే గుసగుసలు వినిపించాయి. అయితే మంచు విష్ణు సైతం తన తండ్రి మోహన్‌బాబు సపోర్ట్ తో సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి వారి సపోర్ట్ తో ముందుకెళ్తున్నారు. మంచు విష్ణుకి ప్రస్తుత `మా` అధ్యక్షుడు వీ.కే నరేష్‌ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తాను ప్రభావితం చేయగలిగిన వారంతా మంచు విష్ణుకి ఓట్‌ వేసేలా చక్రం తిప్పుతున్నారు నరేష్‌. ఇటీవల  ప్రెస్‌మీట్‌లో సైతం పనిచేసేవారికే ఓటు వేయాలని, పనికి మాలిన వాళ్లంతా వస్తే సంస్థ మనుగడ కష్టమని నరేశ్ స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే
Nayanthara Controversies: నయనతారతో కలిసి అల్లు అర్జున్ జీవితంలో నటించడా.. ఒకటా రెండా లెక్కలేనన్ని వివాదాలు