స్టార్ హీరో  ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ సీజ్ చేసిన అధికారులు

Published : Aug 23, 2021, 01:03 PM IST
స్టార్ హీరో  ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ సీజ్ చేసిన అధికారులు

సారాంశం

సీజ్ చేసిన కార్లలో కొన్ని బాలీవుడ్ స్టార్స్ దగ్గర నుండి కొన్నవిగా అధికారులు భావిస్తున్నారు. పన్ను చెల్లించని, సంబంధిత పత్రాలు లేని కొన్ని లగ్జరీ కార్లు స్టార్స్ అక్రమంగా అమ్మివేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

బెంగుళూరులో ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏడు లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఖరీదైన కార్లకు సంబంధించిన పాత్రలు లేకపోవడంతో పాటు, పన్ను చెల్లించని కారణంగా సదరు కార్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. యూబీ సిటీలో పార్క్ చేసి ఉన్న కార్లను అధికారులు అధీనంలోకి తీసుకోవడం జరిగింది. 


ఈ సీజ్ చేసిన కార్లలో కొన్ని బాలీవుడ్ స్టార్స్ దగ్గర నుండి కొన్నవిగా అధికారులు భావిస్తున్నారు. పన్ను చెల్లించని, సంబంధిత పత్రాలు లేని కొన్ని లగ్జరీ కార్లు స్టార్స్ అక్రమంగా అమ్మివేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఓ బాలీవుడ్ స్టార్స్ అని తెలుస్తుండగా, సదరు స్టార్ పేరు బయటికి రాలేదు. 

ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎన్ శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కార్లకు సంబంధించిన పత్రాలు డ్రైవర్స్ దగ్గర లభించలేదు. ఈ లగ్జరీ కార్లు ఎవరికి చెందినవి అనే సమాచారం లేదు. సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేయడం జరిగింది, అన్నారు.  


 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి