ఓబులమ్మ గా రకుల్... గతంలో ఎన్నడూ చేయని పాత్రలో

Published : Aug 23, 2021, 10:48 AM IST
ఓబులమ్మ గా రకుల్... గతంలో ఎన్నడూ చేయని పాత్రలో

సారాంశం

కొండపొలం మూవీలో వైష్ణవ్ కి జంటగా రకుల్ ప్రీత్ నటించారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. లంగా ఓణీలో అమాయకంగా ఉన్న రకుల్ లుక్ 80ల నాటి పల్లెటూరి అమ్మాయిలను గుర్తు చేస్తుంది.


చడీ చప్పుడు లేకుండా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ మూవీ పూర్తి చేశాడు దర్శకుడు క్రిష్. ఈ మూవీ గురించిన డిటైల్స్ చిత్ర బృందం మీడియాతో చాలా కాలం పంచుకోలేదు. ఇటీవల టైటిల్ పోస్టర్ తో పాటు వైష్ణవ్ లుక్ విడుదల చేశారు. కొండపొలం పేరుతో తెరకెక్కిన ఈ మూవీ పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లు పోస్టర్ టైటిల్ ద్వారా తెలుస్తుంది. 


కొండపొలం మూవీలో వైష్ణవ్ కి జంటగా రకుల్ ప్రీత్ నటించారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. లంగా ఓణీలో అమాయకంగా ఉన్న రకుల్ లుక్ 80ల నాటి పల్లెటూరి అమ్మాయిలను గుర్తు చేస్తుంది. ఇక గొర్రెలు కాచుకునే అమ్మాయి ఓబులమ్మ రోల్ చేస్తున్నారు రకుల్.  దర్శకుడు క్రిష్ కొండపొలం మూవీతో ప్రయోగం చేస్తున్నారని అర్థం అవుతుంది. 


ఇక రకుల్ తెలుగులో ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా కొండపొలం ఆమెకు మరలా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందేమో చూడాలి. రకుల్ ఇటీవల నటించిన చెక్ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే రకుల్ కి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. 


ఇక ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ ఆరంభం దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ నుండి వస్తున్న సెకండ్ మూవీ కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెనలో చేపలు పట్టే కుర్రాడిగా నటించిన వైష్ణవ్, కొండపొలం మూవీలో పల్లెటూరి యువకుడు రోల్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి