నటికి ఆర్థిక కష్టాలు, నగలు, కారు అమ్ముకొని దీనస్థితికి... సోను సూద్ ని కలిసినా నిరాశే!

By team teluguFirst Published Jul 8, 2021, 3:47 PM IST
Highlights

బాలీవుడ్ సీరియల్ నటి షా గుప్త తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె ఇప్పటికే ఆర్థిక అవసరాల కోసం నగలు, కారు అమ్మేశారట.

సీనియర్ నటి షా గుప్త ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. అలాంటి షా గుప్త వైద్యం ఖర్చుల కోసం సర్వస్వం కోల్పోయినట్లు వెల్లడించారు.  బుల్లితెరపై అత్యంత ప్రాచుర్యం పొందిన పునర్వివాహ్,  సంజీవని, జారా వంటి సీరియల్స్ లో నటించిన షా గుప్తకు గతంలో రొమ్ము క్యాన్సర్ వచ్చిందట. దానితో అప్పటి వరకు దాచుకున్న సేవింగ్స్ అన్ని వైద్యానికి ఖర్చయిపోయాయట. 


ఇటీవల కరోనా పరిస్థితుల కారణంగా ఆఫర్స్ భారీగా తగ్గిపోయాయట. దీనితో ఆమెకు మరిన్ని సమస్యలు ఎదురయ్యాయట. అలాగే డయాబెటిస్ తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ పోషణ, వైద్య ఖర్చుల కోసం నగలు, కారు కూడా అమ్మివేశారట. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా మరింతగా దిగజారిపోయారని తెలుస్తుంది. 


షా గుప్త పరిస్థితి తెలిసిన సహ నటులు కొందరు ఆర్థిక సాయం చేశారట. అలాగే షా గుప్త సోనూ సూద్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారట. ఆయనను స్వయంగా కలిసి ఆర్థిక సహాయం చేయాలని కోరినా, సోనూ సూద్ చేయలేదని షా గుప్త తెలిపారు. దేశంలో ఉన్న అనేక చిత్ర పరిశ్రమల్లో ఈ పరిస్థితి నెలకొంది. సీనియర్ నటులకు అవకాశాలు తగ్గిన తరువాత వారు అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

click me!