కూతురి ప్రేమలో పడి పిచ్చివాడిగా మారిన హరి తేజ భర్త!

Published : Jul 08, 2021, 03:22 PM IST
కూతురి ప్రేమలో పడి పిచ్చివాడిగా మారిన హరి తేజ భర్త!

సారాంశం

ఇక కూతురు ప్రేమలో పడిపోయిన దీపక్ రావ్, ఎప్పుడూ బిడ్డతోనే గడుపుతున్నారట, కూతురిని చేతులలోకి తీసుకొని ఆడిపించడం దీపక్ కి దినచర్యగా మారిపోయింది. ఆలా రోజంతా భూమితో గడుపుతున్న దీపక్, పాప చేతిలో లేనప్పుడు కూడా ఉన్నట్లుగా ఆడిస్తున్నాడట. 

నటి హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే బారసాల కూడా నిర్వహించి పాపకు పేరు పెట్టారు. భూమి దీపక్ రావ్ అని పాపకు నామకరణం చేయడం జరిగింది. భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ. 


ఇక కూతురు ప్రేమలో పడిపోయిన దీపక్ రావ్, ఎప్పుడూ బిడ్డతోనే గడుపుతున్నారట, కూతురిని చేతులలోకి తీసుకొని ఆడిపించడం దీపక్ కి దినచర్యగా మారిపోయింది. ఆలా రోజంతా భూమితో గడుపుతున్న దీపక్, పాప చేతిలో లేనప్పుడు కూడా ఉన్నట్లుగా ఆడిస్తున్నాడట. అలా భ్రమ పడుతున్న భర్త దీపక్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన హరి తేజ... డాడీ ఆన్ డ్యూటీ అంటూ కామెంట్ పెట్టింది. 

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన హరితేజ వెండితెరపై వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె బిజీ కావడం జరిగింది. ప్రతిరోజూ పండగే, హిట్ వంటి చిత్రాలలో హరితేజ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 లో హరితేజ పాల్గొన్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న హరితేజ మరి కొంత పాపులారిటీ తెచ్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?