‘తిమ్మరుసు’ థియేటర్ రిలీజ్ ఈ నెల్లోనే.. ఎప్పుడో తెలిస్తే సర్‌ప్రైజ్‌ ఖాయం..

By Surya Prakash  |  First Published Jul 8, 2021, 2:58 PM IST

కరోనాతో మూతబడ్డ థియేటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రీఓపెన్ కు రంగం సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని  సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 


 సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి”.  తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను నిర్వాణ సినిమాస్ సొంతం చేసుకుంది. అయితే ఈ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయని తెలియలేదు.ఇక ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందుతున్న సమాచారం మేరకు డైరక్ట్ థియోటర్ రిలీజ్ కానుంది.  కరోనాతో మూతబడ్డ థియేటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రీఓపెన్ కు రంగం సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని, జూలై 30న ఈ చిత్రం విడుదల కాబోతోంది. థియేటర్లు ఓపెన్‌ అయ్యాక విడుదలయ్యే తొలి చిత్రమిదే కావడం విశేషం. 

న్యాయవాది పాత్రలో  సత్యదేవ్‌ లుక్‌  అదుర్స్‌ అనిపిస్తున్నాయి. క్లీన్‌ షేవ్‌, పెద్ద కళ్లద్దాలు, పొడవైన జుత్తుతో క్లాస్‌గా కనిపించి ఆకట్టుకుంటున్నారు సత్యదేవ్‌. మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అజయ్‌, రవిబాబు, అంకిత్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష తదితరులు నటించారు.

Latest Videos

 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇది 2017లోని కొరియన్ మూవీ “న్యూ ట్రయల్” ఆధారంగా రూపొందించబడింది.ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్‌. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ పొడ్రక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది.  

ఇక సత్యదేవ్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’,‘స్కైలాబ్‌’ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు సత్యదేవ్‌.  వీటితోపాటు మరికొన్ని కథల్ని వింటున్నారాయన. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రామ్‌ సేతు’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.
 

click me!