బికినీలో వీధుల్లో తిరుగుతున్న సీరియల్ హీరోయిన్... పండగ చేసుకుంటున్న జనాలు!

By Sambi ReddyFirst Published Mar 18, 2023, 6:12 PM IST
Highlights

నాగినీ ఫేమ్ మౌని రాయ్ బికినీ ధరించి పబ్లిక్ లో తిరుగుతుంది. సదరు ఫోటోలు, వీడియోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా జనాలు పండగ చేసుకున్నారు.

రన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మౌని రాయ్ సడన్ గా సీరియల్స్ కి షిఫ్ట్ అయ్యారు. ఈ బెంగాల్ చిన్నది క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తో బుల్లితెర అరంగేట్రం చేశారు. నాగినీ సిరీస్ ఈమెకు భారీ ఫేమ్ తెచ్చింది. నాగినీ సీరియల్ తెలుగులో కూడా డబ్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగినీ 1,2,3 సీజన్స్ లో మౌని రాయ్ నటించారు. ఒక ప్రక్క సీరియల్స్ లో నటిస్తూనే సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. 

కెజిఎఫ్ హిందీ వెర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. సౌత్ లో తమన్నా చేయగా హిందీలో మౌని రాయ్ ఐటెం నంబర్ చేసి అలరించారు. ఇక గత ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రంలో మౌని రాయ్ మెయిన్ విలన్ రోల్ చేయడం విశేషం. రన్బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ బ్రహ్మాస్త్రలో నటించారు. భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించారు. అయాన్ ముఖర్జీ దర్శకుడిగా ఉన్నారు. 

గత ఏడాది మౌని రాయ్ వివాహం చేసుకున్నారు. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో ఏడడుగులు నడిచారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వివాహం అనంతరం కూడా కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ టైటిల్ తో ఒక మూవీలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తెరకెక్కించాల్సి ఉంది. పార్ట్ 1 ఆశించిన స్థాయిలో ఆడలేదు. నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో పార్ట్ 2 తెరకెక్కించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

కెరీర్ సంగతి అలా ఉంటే... మౌని రాయ్ సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తుంది. బికినీ ధరించి వీధుల్లో తిరిగేస్తుంది. మౌని రాయ్ లేటెస్ట్ హాట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ అర్ధనగ్నంగా పబ్లిక్ లో తిరగేస్తుంటే జనాలు హవ్వా అంటున్నారు. మౌని రాయ్ తెగింపు చూసిన కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!