రిచ్ పబ్ లో రామ్ గోపాల్ వర్మ రచ్చ.. మళ్లీ ఏం చేశాడు.. వైరల్ అవుతున్న వీడియో!

Published : Oct 31, 2022, 11:03 AM IST
రిచ్ పబ్ లో రామ్ గోపాల్ వర్మ రచ్చ.. మళ్లీ ఏం చేశాడు.. వైరల్ అవుతున్న వీడియో!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  (Ram Gopal Varma) పర్సనల్ లైఫ్ ను ఎంతలా ఎంజాయ్ చేస్తాడో తెలిసిందే.  పబ్స్, పార్టీలకూ వెళ్తూ రచ్చరచ్చ చేస్తుంటాడు. తాజాగా ఓ పబ్ లో సందడి చేశారు.   

డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిని చూపించిన ఆర్జీవీ.. పర్సనల్ లైఫ్ ను కూడా ఉదాహరణగా మార్చుతున్నారు. ‘ఉన్నది ఒక్కట్టే జీవితం.. నేను ఎవరి కోసం పుట్టలేదు.. నాకోసం ఎవరు పుట్టలేదు’ అనే మోటీవ్ తో బతికే ఆర్జీవీ సమాజ నియమాలకు భిన్నం జీవిస్తున్నాడు. మరోవైపు ఇండియన్ లాకు లోబడే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చట్టపరంగా తనకున్న స్వేచ్ఛను నూటికి నూరు శాతం వినియోగించుకుంటున్నారు. 

ఇక సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటారు రామ్ గోపాల్ వర్మ. సోషల్ ఇష్యూస్ పై స్పందించడంతో పాటు.. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటాడు. పబ్స్, పార్టీల్లో అమ్మాయిలతో ఆర్జీవీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిరభ్యరంతంగా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పంచుకున్న మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని రిచ్ అరేంజ్ మెంట్స్ కలిగిన ప్రిస్మ్ క్లబ్ లో నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ రచ్చరచ్చ చేశారు. హాలోవీన్ క్యాస్టూమ్స్ లో యువతతో కలిసి ఎంజాయ్ చేశారు. డీజే సాంగ్స్ ను ఎంజాయ్ చేస్తూ పార్టీ వైబ్ లో మునిగి తేలారు. పబ్ లో ఆర్జీవీ ఎంట్రీ ఇవ్వడంతో మరింత సందడి పెరిగింది. పబ్ లో అమ్మాయిలతో అదిరిపోయే స్టెప్పులేయడంతో పబ్ మొత్తంగా గోలగోలగా మారింది. ఈ క్రమంలో తీసిన వీడియోలను ట్విటర్ వేదికన పంచుకున్నారు ఆర్జీవీ. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘కింగ్ సైజ్ లైఫ్’ అంటుంటే.. మరికొందరు మాత్రం దెప్పిపొడుస్తున్నారు. 

సినిమాల విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొద్దికాలంగా బర్నింగ్ ఇష్యూస్ పైనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. పొలిటికల్ అంశాలు, సమాజంలోని మార్పులను తన వ్యూ పాయింట్ లో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ‘వ్యూహం’(Vyuham) ,‘శపథం’ అనే రాజకీయల చిత్రాలను  తెరకెక్కించబోతున్నారు. ‘వంగవీటి’ప్రొడ్యూసరే ఈ సినిమాలకు నిర్మాత. మొదట వ్యూహం, ఆ తర్వాత శపథం చిత్రం రానుందని క్లారిటీ కూడా ఇచ్చారు.  ఈ చిత్ర నిర్మాణం కోసం రీసెంట్ గా ఏపీ సీఎం జగన్ (CM Jagan) కూడా కలిశారు. ప్రస్తుతం ఆర్జీవీ మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. 

PREV
click me!

Recommended Stories

Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం