అమీర్ ఖాన్ తల్లికి హార్ట్ ఎటాక్.. ఫ్యామిలీ అంతా హాస్పిటల్ లోనే..

Published : Oct 31, 2022, 10:42 AM IST
అమీర్ ఖాన్ తల్లికి హార్ట్ ఎటాక్.. ఫ్యామిలీ అంతా హాస్పిటల్ లోనే..

సారాంశం

తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న నటుడు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ చివరగా లాల్ సింగ్ చద్దా చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు.

తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న నటుడు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ చివరగా లాల్ సింగ్ చద్దా చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. అయితే తాజాగా అమీర్ ఫ్యామిలిలో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ హార్ట్ ఎటాక్ కి గురయ్యారు. 

తీవ్రమైన హార్ట్ ఎటాక్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ముంబైలోనే బీచ్ కెనడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అమీర్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రిలోనే ఉంటున్నట్లు సమాచారం. వైద్యానికి స్పందిస్తూ జీనత్ హుస్సేన్ కోలుకుంటున్నారట. ఇటీవల దీపావళి సెలెబ్రేషన్స్ సందర్భంగా ఆమె గుండె పోటుకి గురైనట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ ఈ ఏడాది జూన్ లో తన తల్లి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

అమీర్ ఖాన్ తండ్రి, జీనత్ భర్త తాహిర్ హుస్సేన్ 2010లో మరణించారు. తాహిర్ బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. సినిమాల విషయానికి వస్తే ఇటీవల అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రం విడుదలై నిరాశపరిచింది. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ఎంతో ఇష్టపడి నటించారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. 

PREV
click me!

Recommended Stories

Don 3 Controversy: డాన్ 3 ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా? రణ్‌వీర్ షరతులే కొంపముంచాయా!
Bellamkonda Sreenivas: సమంత నుంచి పూజా హెగ్డే వరకు.. తనకన్నా ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన హీరో