
అలనాటి గాయన ఎల్ ఆర్ ఈశ్వరి ఐటెమ్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె గొంతులో ప్రత్యేక పాట పాడితే యువతతోపాటు 60 దాటిన వాళ్లు కూడా డాన్సులేయాల్సిందే. మాస్ డాన్సులతో పూనకాలు పొందాల్సిందే. `మసక మసక చీకటిలో.. `, `తీస్కో కోకోకోలా, `భలే భలే మగాడివోయ్ బంగారు నాసామివోవయ్` వంటి పాటలే అందుకు నిదర్శనం. ఈ పాటలో ఎల్ ఆర్ ఈశ్వరి అప్పట్లో తెలుగు రాష్ట్రాలను ఊపేసింది.
తాజాగా ఆమె చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చింది. తన బాధలను, ఆసక్తికర విషయాలను పంచుకుంది. కోరస్ సింగర్ నుంచి మెయిన్ స్ట్రీమ్ సింగర్‌గా మారిన ఎల్‌ఆర్ ఈశ్వరీ. అయితే ప్రారంభంలో గెంటివేతలకు గురయ్యిందట. `సువర్ణ సుందరి` చిత్రంలో `పిలవుకురా` పాటకి కోరస్ ఇస్తుంటే తన గొంతు బాలేదని బయటకు పంపించారట. ఆ సమయంలో తన మదర్ చాలా బాధ పడిందని చెప్పింది ఈశ్వరీ. ఆమెకి కూడా కోరస్ సింగర్‌గా రాణించారని తెలిపింది. ఎవరైతే తన గొంతు బాలేదని బయటకు పంపించారో, వాళ్లే తన పాటను రికార్డ్ చేసే రోజు వస్తుందని అమ్మ ఓదార్చిందట.
ఆ సమయంలో తాను చాలా కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెప్పింది ఈశ్వరీ. తాను పెద్ద సింగర్ అయ్యాక అదే రికార్డిస్టు తన పాటలు రికార్డు చేశాడని చెప్పింది. ఇప్పటి పాటలపై ఆమె పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె పాటలకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా గాయని ఎల్ ఆర్ ఈశ్వరీ మాట్లాడుతూ, ఇప్పుడొస్తున్న పాటలు తనకు నచ్చడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా ఊఊ అంటావా` పాటపై స్పందించింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు అదొక పాటేనా అంటూ షాకిచ్చింది.
పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఓకేలా ఉంటుందని, మ్యూజిక్ డైరెక్టర్ చూసుకోవాలి కదా అని, పిల్లలకేం(ఇప్పటి సింగర్స్ కి) తెలుసు, వాళ్లు చెప్పినట్టు పాడతారు, మ్యూజిక్ డైరెక్టర్స్ చూసుకోవాలి కదా అని ఆమె తెలిపింది. అదే పాట తన వద్దకు వచ్చి ఉంటే ఆ కలరే వేరని, దాని రేంజే మారిపోయేదని పేర్కొంది. అప్పట్లో తాము ఎంతో సన్నియర్‌గా పనిచేశామని, అందుకే ఆ పాటలు ఇప్పటికీ నిలబడుతున్నాయని చెప్పిందని చెప్పింది ఈశ్వరీ. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన `పుష్ప` ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇందులో సమంత ఐటెమ్ సాంగ్ చేసింది. `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ `పాటలో ఆడి పాడింది. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. చంద్రబోస్ రాశారు.