
లాస్యకు ఇప్పుడు తొమ్మిదో నెల. కడుపులో బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడట. కాళ్ళతో తంతున్నాడట. ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుందని లాస్య తెలియజేశారు. ఎనిమిదో నెలకు మించి తొమ్మిదో నెలలో బిడ్డ కదిలికలు ఎక్కువగా ఉన్నాయట. తాజాగా లాస్య ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెలలు నిండిన నేపథ్యంలో లాస్య త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.
లాస్యకు ఇది రెండో ప్రెగ్నన్సీ. గత ఏడాది సెప్టెంబర్ లో లాస్య గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భర్త మంజునాథ్ తో ఫొటోలకు ఫోజులిచ్చిన లాస్య తన మెడికల్ రిపోర్ట్స్ చూపించారు. మంజునాథ్ ని లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఆమె పేరెంట్స్ ఒప్పుకోలేదట. దీంతో చాలా కాలం ఆమె తల్లిదండ్రులకు దూరంగా భర్తతో జీవించారట. అయితే లాస్య తల్లి అయ్యాక పేరెంట్స్ దగ్గరకు తీశారు. లాస్యకు మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. కొడుకుని జున్ను అని లాస్య ప్రేమగా పిలుచుకుంటారు.
తన ప్రేమ, పెళ్లి గురించిన విషయాలు లాస్య బిగ్ బాస్ హౌస్ లో బహిర్గతం చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత లాస్య మళ్ళీ గర్భం దాల్చారు.కాగా యాంకర్ గా ఫేమస్ అయిన లాస్య బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన లాస్య అంచనాలు అందుకోలేకపోయారు. ఫెయిర్ గేమ్ ఆడుతూ ఆమె ప్రేక్షకుల తిరస్కరణకు గురయ్యారు. నాగార్జున సైతం ఆమెను ఫేక్ గేమ్, స్మైల్ అని నిందించారు. టైటిల్ విన్నర్ అభిజీత్, అలేఖ్య హారిక, సింగర్ నోయల్ తో లాస్య ఎక్కువగా కలిసి ఉండేవారు. వీరిది హౌస్ లో ఒక గ్రూప్ అని చెప్పాలి. లాస్య కనీసం ఫైనల్ కి కూడా చేరలేదు.
ఆ మధ్య లాస్య అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రిలో పేషేంట్ గా బెడ్ పై ఉన్న లాస్య ఫోటోను మంజునాథ్ షేర్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని వేడుకున్నాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. హెవీ ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన లాస్య తిరిగి కోలుకున్నారు.