యంగ్ హీరో నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. సాంగ్ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి.. ఫలాన అమ్మాయి’ (PAPA). చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్ది కాంబినేషన్ లో గతంలో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా గతంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించగా సినిమాపై ఆసక్తిని పెంచేలా మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు. ఇప్పటికే మొదటి సాంగ్ 'కనుల చాటు మేఘమా' శ్రోతలను కట్టిపడేసిన విషయం తెలిసిందే. సెకండ్ సింగిల్ గా సినిమా టైటిల్ సాంగ్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది.
నాయకా, నాయికల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? వారి ప్రయాణం సాగింది? అనే విషయాలను తెలుపుతూ సాగే పాట ఇది. లిరికల్ వీడియోలో నాయకా నాయికల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పాత్రల తీరు, వారి పరిచయం కాస్త భిన్నం అని తెలిపేలా.. వీడియో ప్రారంభంలో ఓ వైపు నాయకా నాయికలు వర్షంలో తడుస్తూ ఉండటం, మరోవైపు ఆకాశంలో సూర్యుడు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. మొదటి నుండి చివరి వరకు వారి ప్రయాణం ఎంతో అందంగా ఆసక్తికరంగా సాగిందని అర్థమవుతోంది. "ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా.." అంటూ సాగే ఈ పాట మొదటిసారి వినగానే పాడాలి అనిపించేలా ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంది.
కళ్యాణి మాలిక్ క్యాచీ ట్యూన్ అందించగా.. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు నసాహిత్యాన్ని అందించారు. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే టైటిల్ కి తగ్గట్లుగానే సహజత్వం ఉట్టిపడేలా తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించేలా ఆయన పాట రాసిన తీరు ఆకట్టుకుంది. ఇక 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ (Malvika Nair) హీరో హీరోయిన్లుగా మరోసారి అలరించబోతున్నారు. మార్చి 17న సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Loveable Retro Melody
title song out now
Watch Full Lyrical here👇https://t.co/94XgluKmNa pic.twitter.com/ssWqsQf4Ml