మరో ఆణిముత్యాని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్!

Published : May 16, 2021, 12:20 PM ISTUpdated : May 16, 2021, 12:24 PM IST
మరో ఆణిముత్యాని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్!

సారాంశం

ప్రముఖ రచయిత అదృష్ట దీపక్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 70ఏళ్ల అదృష్ట దీపక్ ఇటీవల కరోనా బారినపడడం జరిగింది. 

కరోనా మరో ఆణిముత్యాన్ని పరిశ్రమకు దూరం చేసింది. కరోనా కారణంగా అభ్యుదయ కవిగా పేరుగాంచిన అదృష్ట దీపక్ కన్నుమూశారు. టాలీవుడ్ లో కోవిడ్ మరణాలు సర్వసాధారణం అయిపోయాయి. రోజుల వ్యవధిలో పలువురు చిత్ర ప్రముఖులు ప్రాణాలు విడిచారు. కోరలు చాచిన కరోనా ఒక్కొక్కరిగా పొట్టన పెట్టుకుంటుంది. 


వరుస కరోనా మరణాలు దిగ్బ్రాంతి కలిగిస్తుండగా, ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత అదృష్ట దీపక్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 70ఏళ్ల అదృష్ట దీపక్ ఇటీవల కరోనా బారినపడడం జరిగింది. దీనితో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్స్ ఆయనను కాపాడలేకపోయారు.  

వీరికి భార్య, కుమారుడు ఉన్నారు. మాదాల రవి రూపొందించిన 'నేను సైతం' గీత రచయితగా అదృష్ట దీపక్ ఆఖరి చిత్రం. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపం... రాయవరం మండలం 'సోమేశ్వరం' వీరి స్వస్థలం. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్టదీపక్ రామచంద్రాపురంలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. "ఆశయాల పందిరిలో... అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి... ఏటికెదురు నిలిచాయి" (యువతరం కదిలింది), "నేడే... మేడే' (ఎర్రమల్లెలు), "మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం", (నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాలను అదృష్ట దీపక్ రచించడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్