హీరోయిన్ గా లయ కూతురు..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీనియర్ హీరోయిన్!

Published : Feb 28, 2023, 11:05 AM ISTUpdated : Feb 28, 2023, 11:12 AM IST
హీరోయిన్ గా లయ కూతురు..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీనియర్ హీరోయిన్!

సారాంశం

స్వయంవరం లయ తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కూతురు కెరీర్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా లయ పేరు తెచ్చుకున్నారు. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. పెళ్లి తర్వాత లయ పరిశ్రమకు దూరమయ్యారు. భారీ గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చారు. 2006లో అమెరికాలో డాక్టర్ గా స్థిరపడిన గణేష్ గోర్తి తో లయ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. చాలా రోజుల తర్వాత లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారు. తన కూతురిని హీరోయిన్ చేయాలనే కోరిక లయ పరోక్షంగా బయటపెట్టారు. 

 అమ్మాయి శ్లోకా గోర్తీ 9వ తరగతి చదువుతుంది. మా ఇద్దరినీ పక్కపక్కన చూసిన చాలా మంది అక్కాచెల్లెలు అనుకుంటున్నారు. శ్లోకా చాలా అందంగా ఉంటుంది. తనని హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఆశ ఉంది. అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే మా అమ్మాయికి అవకాశాలు ఇవ్వమని నేను ఎవరినీ అడగను. అలాగే హీరోయిన్ అవ్వు, పరిశ్రమకు వెళ్ళమని నేను తనని బలవంతం చేయను. తన ఇష్టమైన రంగం ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తానని... లయ అన్నారు. 

ఇక అమ్మాయికి 12 ఏళ్ళు. ఇద్దరూ తెలుగు బాగానే మాట్లాడతారు. ఇంగ్లీష్ లో మాట్లాడటం అలవాటయ్యాక... తెలుగు మర్చిపోయారని లయ చెప్పుకొచ్చారు. ఎన్ని కోట్లు ఉన్నా నాకు చిన్న చిన్న విషయాలు సంతోషాన్ని ఇస్తాయన్నారు. డ్రాయింగ్ ఇష్టమైన వ్యాపకమన్న లయ... బొమ్మలు వేస్తుంటే తెలియని ఆనందం కలుగుతుందన్నారు. లయకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. సినిమా ఆమెకు ప్యాషన్ మాత్రమే. కొన్నాళ్లు అమెరికాలో ఐటీ ఉద్యోగం చేశారుట. 

1999లో విడుదలైన స్వయంవరం హీరోయిన్ గా లయ మొదటి చిత్రం. అంతకు ముందు ఒక చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ప్రేమించు సినిమాలో గుడ్డి అమ్మాయిగా నటించి మెప్పించారు. సరేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ప్రేమించు సూపర్ హిట్ కొట్టింది. బాలయ్యతో విజయేంద్రప్రసాద్ మూవీలో జతకట్టారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో లయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ తల్లిగా చిన్న పాత్ర చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌