పవన్ చిత్రం నుంచి తప్పుకున్న రచయిత.. త్రివిక్రమ్ తో చెడిందా.. ?

Published : Feb 28, 2023, 10:18 AM IST
పవన్ చిత్రం నుంచి తప్పుకున్న రచయిత.. త్రివిక్రమ్ తో చెడిందా.. ?

సారాంశం

వినోదయ సిత్తం రీమేక్ కి స్క్రిప్ట్ త్రివిక్రమ్ అందించగా డైలాగ్స్ రాసే బాధ్యతని స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కి అప్పగించారట. అయితే తాజాగా ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మల్టిపుల్ చిత్రాలతో బిజీ అయ్యారు. హరి హర వీరమల్లు షూటింగ్ ఇంకా మిగిలి ఉంది. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ ని కూడా ప్రారంభించడం జరిగింది. తమిళంలో విజయం సాధించిన చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. 

హరి హర వీరమల్లు చిత్రాన్ని పక్కన పెట్టి మరీ పవన్ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు సముద్ర ఖని అయినప్పటికీ.. త్రివిక్రమ్ ప్లానింగ్ తోనే ముందుకు వెళుతున్నారట. తెలుగు వర్షన్ కోసం కథలో మార్పులు చేసిన కొత్త స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ అయిందించారట. అయితే ఈ చిత్రంపై ఊహించని రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. 

వినోదయ సిత్తం రీమేక్ కి స్క్రిప్ట్ త్రివిక్రమ్ అందించగా డైలాగ్స్ రాసే బాధ్యతని స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కి అప్పగించారట. అయితే తాజాగా ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో విభేదాల కారణంగానే సాయి మాధవ్ ఈ చిత్రం నుంచి బయటకి వెళ్లారని అంటున్నారు. 

సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ ని త్రివిక్రమ్ తీసుకోలేదని, ఆయనకి క్రెడిట్ కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రం కోసం సాయి మాధవ్ కి రెమ్యునరేషన్ ఇచ్చారా అనే సందేహం కూడా వినిపిస్తోంది. 

ఈ వివాదంపై వైరల్ అవుతున్న మరో వర్షన్ ఏంటంటే.. సాయి మాధవ్.. పవన్ కళ్యాణ్ పాత్రకి రాసిన డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. దీనితో మరోసారి డైలాగ్స్ రాయాలని అడిగారట. కానీ తనకి వేరే కమిట్మెంట్స్ ఉండడంతో సాయి మాధవ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఏదో వారికే తెలియాలి. 

పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో దేవుడిగా నటిస్తుండగా.. సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే