పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను... నా కెరీర్ దెబ్బతింది!

Published : Jun 16, 2021, 05:27 PM ISTUpdated : Jun 16, 2021, 05:32 PM IST
పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను... నా కెరీర్ దెబ్బతింది!

సారాంశం

సింగిల్ పేరెంట్ గా ఆమె అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు నీనా ఆ పుస్తకంలో వెల్లడించారు. రిచర్డ్స్ నుండి విడిపోయి గర్భవతిగా ఉన్న సమయంలో నీనా మిత్రుడు సతీష్ కౌశిక్ ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నారట. 

80,90లలో బాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ లో ఒకరిగా వెలిగిపోయారు నీనా గుప్తా. అయితే ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యక్తిగతంగా ఇబ్బందులు, విమర్శలపాలు చేశాయి. లెజెండరీ క్రికెటర్ వివి రిచర్డ్స్ తో ఆమె సహజీవనం చేయడం జరిగింది. అప్పటికే వివాహం జరిగి ఉన్న రిచర్డ్స్ ఆమెను గర్భవతిని చేసి వదిలేశాడు. పెళ్లి కాకుండానే గర్భవతిని కావడం తన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపిందని నీనా గుప్తా తన ఆటోబయోగ్రఫీలో తెలియజేశారు. 


సింగిల్ పేరెంట్ గా ఆమె అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు నీనా ఆ పుస్తకంలో వెల్లడించారు. రిచర్డ్స్ నుండి విడిపోయి గర్భవతిగా ఉన్న సమయంలో నీనా మిత్రుడు సతీష్ కౌశిక్ ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నారట. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అవుతుంది. తెల్లగా పుడితే నీ పోలికలు, నల్లగా పుడితే నా పోలికలు అని చెబుతాం అన్నాడట. అయితే స్నేహితుడు ప్రతిపాదన తాను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. 


నీనా గుప్తాకు ఆడపిల్ల పుట్టగా మాసాబ గుప్తా అని పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ని వివాహం ఆడారు. నటిగా ఇప్పటికి కూడా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు నీనా గుప్తా. కపిల్ బయోపిక్ 83తో పాటు ఒకటి రెండు హిందీ చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏఆర్ రెహమాన్ యూ టర్న్, వివాదాల జోలికి వెళ్లను.. చెప్పినా వినరన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..