
అనుపమా పరమేశ్వరన్ ( Anupama Parameswaran) వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అనుపమ తాజాగా నటించిన చిత్రం ‘బటర్ ఫ్లై’ (Butterfly Movie). ఫిబ్రవరి 18న అనుసమ బర్త్ డే సందర్భంగా ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా మూవీ నుంచి టీజర్ ను వదిలారు.
ఒక అపార్ట్ మెంట్ లోకి అనుపమ ఎంటరవుతున్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత లిఫ్ట్ లో.. తన ప్లాట్ లోకి ప్రవేశిస్తున్న సన్నివేశాలు కనిపించాయి. అయితే ప్లాట్ లోకి వెళ్లిన అనుసమ ఇద్దరు స్కూల్ పిల్లలో తిరిగి బయటికి వస్తుంది. కానీ లిఫ్ట్ వద్దకు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతారు. దీంతో వారి కోసం అనుసమా నిరంతరంగా వెతుకులాట ప్రారంభమవుతుంది. సీతాకోక చిలుకలా క్షణం తీరికలేకుండా పిల్లల ఆచూకీ కోసం వెతుకుతూనే ఉంటుంది. తమ ప్లాట్స్ లోని ఓ వ్యక్తితో కలిసి మరో కోణంలో వెతికినా ఫలితం ఉండదు. కానీ పిల్లల ఐడీ కార్డ్స్ మాత్రం లభిస్తాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గుర్తుతెలియని వ్యక్తిని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చిక్కుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు?.. అసలు పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్లారు? పిల్లలకు అనుసమకు సంబంధం ఏంటీ? అసలు పిల్లలు మళ్లీ అనుపమా దగ్గరకు చేరుకుంటారా లేదా? అనే విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. 40 సెకండ్ల పాటు ఉన్న టీజర్ ఆసాంతం ఉత్కంఠ భరితంగా సాగింది.
బటర్‌ఫ్లై చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఘంటా సతీష్‌బాబు. రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోంది. బటర్‌ఫ్లైకి సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ డైరెక్టర్. చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో నిహాల్ కొధాటి మరియు భూమిక చావ్లా కూడా నటించారు. ఇటీవల రిలీజ్ అయిన రౌడీ బాయ్స్ ( Rowdy Boys) తర్వాత అనుపమ బట్టర్ ఫ్లై చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో నిఖిల్ కి జంటగా '18 పేజెస్' మూవీ చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. అలాగే నిఖిల్ మరొక చిత్రం కార్తికేయ 2లోనూ అనుపమ నటిస్తున్నట్లు సమాచారం.