NTR 30: ఎన్టీఆర్ కోసం పక్కా స్కెచ్ తో రంగంలోకి కొరటాల, ఎంతవరకూ వచ్చిందంటే...?

Published : Apr 19, 2022, 09:14 AM IST
NTR 30: ఎన్టీఆర్ కోసం పక్కా స్కెచ్ తో రంగంలోకి కొరటాల, ఎంతవరకూ వచ్చిందంటే...?

సారాంశం

కెరీర్ లో ప్లాప్ అంటూ ఎరుగని టాలీవుడ్  దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇక ఈ స్టార్ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగబోతున్నారు. మరి ఆ ఏర్పాట్లు ఎక్కడివరకూ వచ్చాయి...? షూటింగ్ ఎప్పుడూ...?    

కెరీర్ లో ప్లాప్ అంటూ ఎరుగని టాలీవుడ్  దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇక ఈ స్టార్ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగబోతున్నారు. మరి ఆ ఏర్పాట్లు ఎక్కడివరకూ వచ్చాయి...? షూటింగ్ ఎప్పుడూ...?  

కొరటాల శివ రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ సినమాలకు పనిచేశారు. ఆతరువాత మెగా ఫోన్ పట్టిన కొరటాల అప్పటి నుంచీ స్టార్ హీరోలతో సినమాలు చేసుకుంటూ వస్తున్నాడు.  మెగాఫోన్ పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

ఇంత వరకూ కెరీర్ లో  ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల. ఇక రిలీజ్ రెడీగా ఉన్న కొరటాల సినిమా ఆచార్య. ఈ మూవీ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆతరువాత కోరటాల శివ ఎన్టీఆర్ తో చేయనున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు శివ. దీనికి సంబంధించి ఆయన పక్కాగా స్కెచ్ వేసుకున్నారట. గతంలో   ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను తీసి భారీ సక్సస్ అందకున్నాడు. 

ఇక అదే నమ్మకంతో తన  30వ సినిమా బాధ్యతలను కోరటాలకు అప్పగించాడు తారక్. అయతే ప్రస్తుతం కొరటాల ఆచార్య రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ శేర్ చేసుకున్న ఈమూవీ ప్రమోషన్స్ లో.. శివ బిజీ అయి పోయాడు. అయితే ఆచార్య ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా గురించి రకరకాల ప్రశ్నలు కొరటాలకు ఎదురవుతున్నాయి. వీటిపై టాలీవుడ్ డైరెక్టర్ స్పందిస్తూ..ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగు మొదలవుతుంది అన్నారు కొరటాల శివ.

అంతే కాదు కొరటాల మాట్లాడుతూ.. నాకు పాన్ ఇండియా అనే పదమే నచ్చదు. పాన్ ఇండియా కోసం ఒకలా .. అలా కాకపోతే మరోలా కథలు రాయను.  బలమైన కథాకథనాలతో రాస్తే అందరూ తప్పకుండా చూస్తారు .. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాంటి ఓ మంచి కథనే ఎన్టీఆర్ కోసం రాశాను అన్నారు.  ఇక ఆచార్య రిలీజ్ తరువాత ఎన్టీఆర్  సినిమాకి సంబంధించిన పూర్తి విషయాలు మాట్లాడతాను అని కొరటాల శివ  చెప్పుకొచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?