సీనియర్ నటి విద్యా సిన్హా మృతి.. వారం రోజులుగా ఆసుపత్రిలోనే!

By tirumala ANFirst Published Aug 15, 2019, 4:01 PM IST
Highlights

బాలీవుడ్ సీనియర్ నటి విద్య సిన్హా గురువారం మరణించారు. విద్యా సిన్హా పేరు చెప్పగానే చోటి సే బాత్, పతి పత్ని ఔర్ వాహ్ లాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. 1974లో విద్యా సిన్హా కెరీర్ ప్రారంభమైంది. విద్యా సిన్హా నటించిన తొలి చిత్రం రజనీగంధ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన విద్యా సిన్హా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. 

ఇదిలా ఉండగా విద్యా సిన్హా మృతికి కారణం ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడమే. వారం రోజుల క్రితం విద్యా సిన్హా ముంబై లోని ఓ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆమెకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున విద్యా సిన్హా మృతి చెందినట్లు తెలిసింది. 

విద్యా సిన్హా చివరగా నటించిన చిత్రం 2011లో విడుదలైన బాడీ గార్డ్. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో విద్యా సిన్హా కీలక పాత్రలో నటించారు. ఇక విద్యా సిన్హా వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకులతో కూడుకున్నదే. 1968లో విద్యా సిన్హా వివాహం జరిగింది. వివాహం తర్వాతే ఆమె సినిమాల్లోకి వచ్చారు. 

విద్యా సిన్హా భర్తపేరు వెంకటేశ్వరన్ అయ్యర్. ఈ దంపతులు 1989లో జాన్వీ అనే కుమార్తెని దత్తత తీసుకున్నారు. 96లో వెంకటేశ్వరన్ మృతి చెందారు. 2001లో విద్యా సిన్హా భీం రావు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులకే వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. 2009లో భీం రావు పై విద్యా సిన్హా గృహహింస కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

click me!