నా డ్రెస్ నా ఇష్టం.. సుమని ఏకేసిన అనసూయ!

Published : Aug 15, 2019, 03:28 PM ISTUpdated : Aug 15, 2019, 03:43 PM IST
నా డ్రెస్ నా ఇష్టం.. సుమని ఏకేసిన అనసూయ!

సారాంశం

అనసూయ తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది. యాంకరింగ్ చేస్తూనే నటిగా అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో 'కథనం' చిత్రంలో నటించింది. ఇక అనసూయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. 

అనసూయ మోడ్రన్ డ్రెస్ లలో చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై అనసూయకు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తానిప్పుడు ట్రోలింగ్ ని పట్టించుకోవడం మానేశానని అంటోంది. ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. తన డ్రెస్సింగ్ స్టైల్ తన ఇష్టం అని అంటోంది. నార్త్ ఇండియన్ హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తే చూస్తారు.. గ్లామరస్ గా ఉందని పొగిడేస్తారు. కానీ నాపై మాత్రం బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. 

ఇక తన యాంకరింగ్ గురించి వస్తున్న విమర్శలపై కూడా అనసూయ స్పందించింది. సుమతో పోలిక పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను, సుమ, ఝాన్సీ లాంటి యాంకర్స్ పెళ్ళైనవాళ్ళమే. ఎవరి వెసులుబాటుకు తగ్గట్లుగా వారు యాంకరింగ్ చేస్తున్నారు. కానీ వారి అనుభవం ముందు నేను తక్కువే. అలాగని కొందరు సుమని చూసి నేర్చుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. 

సుమలా నేనెందుకు ఉండాలి.. ఆమెనే నాలాగా ఉండమని చెప్పొచ్చుగా అని అనసూయ బదులిచ్చింది. కాలాన్ని బట్టి ఎలా యాంకరింగ్ చేయాలో సుమకు చెప్పొచ్చుగా.. కాబట్టి ఎవరూ ఎవరికీ సలహాలు ఇవ్వకూడదు అని అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?