తినడానికి తిండి లేదు ఉండటానికి గూడు లేదు... కష్టాల్లో ఉన్న నటికి జబర్దస్త్ ఆఫర్!

By Sambi ReddyFirst Published Mar 23, 2023, 9:45 AM IST
Highlights


నటి వాసుకి ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. తాజా ఎపిసోడ్లో ఆమె తళుక్కున మెరిశారు. 
 

చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. దానికి పరిశ్రమలో ఉన్న దోపిడీ వ్యవస్థే కారణం. హీరో, డైరెక్టర్, హీరోయిన్ తో పాటు కొద్ది మంది ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కోట్లకు కోట్లు తీసుకుంటూ మిగతా ఆర్టిస్ట్స్ కి నామ మాత్రపు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. భరోసా లేని కెరీర్లో ఆఫర్స్ వచ్చినన్నాళ్లే వెలుగు. రోజుకు వేలలో సంపాదించే ఆర్టిస్ట్స్ కి ఆర్థిక భద్రత ఉండదు. వందల చిత్రాల్లో నటించిన రమాప్రభ, శ్రీలక్ష్మితో పాటు పలువురు ఆర్టిస్ట్స్ ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. చెప్పాలంటే అసహాయ ఆర్టిస్ట్స్ లిస్ట్ పెద్దదే. 

అలాంటి వాళ్లలో పాకీజా అలియాస్ వాసుకి ఒకరు. వాసుకి ఈ తరం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. 90లలో లేడీ కమెడియన్స్ లో ఒకరిగా ఆమె సత్తా చాటారు. అసెంబ్లీ రౌడీ మూవీలో వాసుకి చేసిన పాకీజా పాత్ర అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఆ ఒక్క సినిమా వాసుకికి తెలుగులో విపరీతమైన ఫేమ్ తెచ్చింది. టాలీవుడ్ లో ఆమె పేరు స్థిరపడిపోయింది. వాసుకి అంటే ఎవరికీ తెలియదు. పాకీజా అంటే టక్కున నవ్వులు పూస్తాయి. 

తమిళంలో అధిక చిత్రాలు చేసిన వాసుకి 250కి పైగా చేశారు. ఆమె ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కనీసం తినడానికి తిండి లేదు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యానికి డబ్బులు లేవు. ఇటీవల ఓ యూట్యూబర్ ఆమె దీనగాథ వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆమెకు టాలీవుడ్ నుండి కొంత సహాయం అందింది. తన సొంత పరిశ్రమ కోలీవుడ్ పట్టించుకోలేదని ఆమె వాపోయారు. 

ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వాసుకి సడన్ గా జబర్దస్త్ లో మెరిశారు. లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆమె రైజింగ్ రాజుతో పాటు స్కిట్ చేశారు. సినిమా ఆఫర్స్ ఆమెకు రావడం లేదు. కాబట్టి జబర్దస్త్ లో నిలదొక్కుకుంటే ఆమె ఆర్థిక కష్టాలు తీరినట్లే. ఆమెకున్న ఇబ్బందుల రీత్యా ఏ చిన్న అవకాశం వదులుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి జబర్దస్త్ వాళ్ళు ఆమెను ఎన్నాళ్ళు కొనసాగిస్తారో చూడాలి. ఈ ఎపిసోడ్ కి దాస్ కా ధమ్కీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ రావడం విశేషం.  
 

click me!