సీనియర్ నటి లయ (Laya) త్వరలో 12 ఏండ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. రేపు ప్రసారం కానున్న ఉగాది స్పెషల్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారు.
సీనియర్ నటి, తెలుగు హీరోయిన్ లయ (Laya) సినిమాకు దూరమైన చాలా కాలం అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తన ఫ్యామిలీకే పూర్తి సమయం కేటాయించింది. దాదాపు 12 ఏండ్లకు పైగా సినీ ఇండస్ట్రీకి ఆమె దూరంగా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. కానీ తాజాగా మళ్లీ రీఎంట్రీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఓ స్పెషల్ న్యూస్ అందించారు లయ. అందేంటో కాదు.. ఉగాది స్పెషల్ గా ప్రసారం కానున్న ఈవెంట్ లో సందడి చేయబోతున్నట్టు తెలియజేసింది.
ఉగాది స్పెషల్ గా ఈటీవీలో రేపు ప్రసారం కానున్న ‘కలిసుందాం రండి’ ఈవెంట్ కు హాజరైంది. రీసెంట్ గా ఈవెంట్ ను షూట్ చేశారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యతగా ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా లయ తన అఫిషియల్ ఇన్ స్టా అకౌంట్ లో షోలో సందడి చేసినటు వంటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
చాలా కాలం తర్వాత లయ బుల్లితెరపై సందడి చేయబోతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చెక్కుచెదరని అందంతో తెలుగు హీరోయిన్ స్మాల్ స్క్రీన్ పై మెరియబోతుండంతో టీవీ ఆడియెన్స్ తో పాటు లయ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లయ రీఎంట్రీ సందర్భంగా ఆమెను అభిమానించే వారు నెట్టింట వెతడం ప్రారంభించారు.
మరోవైపు సినిమాలకు చాలా దూరమైన లయ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు తగిన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లిగా, తదితర కీలక పాత్రల్లో అలరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అవకాశాల వేటలో ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక రేపటి ప్రోగ్రామ్ లో లయ చీరకట్టులో మెరిశారు. అప్పటికిప్పటికీ ఏమాత్రం ఛేంజ్ కాని రూపసౌందర్యంతో ఆకట్టుకుంటోంది.
1999లో వచ్చిన ‘స్వయంవరం’ చిత్రంలో వేణు తొట్టెంపూడి సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో మెరిసి ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. ఫ్యామిలీ సినిమాలతో 2006 వరకు అలరించింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని 2006లో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాకు దూరంగా ఉంటోంది. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీకి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.