NBK 108 Update: ఫ్యాన్స్ కోసం బాలయ్య సర్ప్రైజ్ సిద్ధం చేశాడా?

By Sambi Reddy  |  First Published Mar 21, 2023, 5:52 PM IST

బాలయ్య లేటెస్ట్ మూవీ నుండి ఉగాది అప్డేట్ సిద్ధం అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ మేరకు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 


నటసింహం బాలయ్య ఎనర్జీ ముందు కుర్ర హీరోలు కూడా సరిపోరు. తన దర్శకులను ఆయన పరుగెత్తిస్తారు. ఐదారు నెలల్లో సినిమా చుట్టి పడేస్తారు. అలాగే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ గగ్గోలు పెట్టాల్సిన పనిలేదు. సడన్ సర్ప్రైజ్లు ఇస్తుంటారు. బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి గమనిస్తే బాలయ్య ఇదే పద్దతి ఫాలో అయ్యారు. సందర్భంగా కూడా లేకుండా ఫస్ట్ లుక్స్, టీజర్స్ వచ్చేసేవి. కాగా అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ ప్రారంభంలో ఉంది.మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. అప్పుడే ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఉగాది కానుకగా NBK 108 ఫస్ట్ లుక్ విడుదల చేసే ఆస్కారం కలదంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది.

  ఇక బాలయ్య ఫార్మ్ లోకి వచ్చారు. వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడ్డ ఆయన సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు ఆయనకు మరపురాని విజయాలు అందించాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మూవీతో హ్యాట్రిక్ మీద కన్నేశారు. బాలయ్య 108వ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ కాజల్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు సెట్స్ లోకి ఘనస్వాగతం పలికారు. 

Latest Videos

కెరీర్లో మొదటిసారి బాలయ్యతో కాజల్ జతకడుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై హైప్ ఏర్పడింది. కాజల్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ఆమె కూడా లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. బాలయ్య, కాజల్, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు సమాచారం. బాలయ్య మూవీలో శ్రీలీల రోల్ ఏంటనేది సస్పెన్సు. బాలయ్య కూతురు పాత్ర అంటూ ప్రచారం జరిగింది. యూనిట్ ఖండించారు. 

ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర నేపథ్యం మీద ఒక హింట్ ఇచ్చారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని చెప్పారు. బాలయ్యను సరికొత్త లుక్ లో ప్రజెంట్ చేస్తారట. ఆయన పాత్ర కూడా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలియజేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. 
 

click me!