
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. హాట్ ఫోటో షూట్లతో ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతుంది. గ్లామర్ ఫోటోలతో తరచూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. గ్లామర్ షోకి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఇప్పటికే ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై క్లారిటీ లేదు. మరోవైపు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఓ సినిమా చేస్తున్నారు. `ఉస్తాద్ భగత్ సింగ్` పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలాని తీసుకుంటున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ కన్ఫమ్ అనే వార్త వచ్చింది. మరోవైపు ఇప్పుడు కొత్తగా మాళవిక మోహనన్ పేరు తెరపైకి వచ్చింది. పూజా స్థానంలో మాళవికని తీసుకున్నారని, మెయిన్ ఫీమేల్ లీడ్‌గా మాళవిక నటిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మాళవిక మోహనన్ రియాక్ట్ అయ్యింది. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, అందులో నిజం లేదని తెలిపింది. పవన్ కళ్యాణ్‌తో నటించాలని తనకు ఉందని, కానీ ఈ వార్త వాస్తవం కాదని చెప్పింది. `పవన్ కళ్యాణ్ సర్‌పై చాలా అభిమానం ఉంది. కానీ నేను ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదు. ప్రస్తుతం ఒక అద్భుతమైన తెలుగు సినిమాలో నటిస్తున్నా. అందులో మెయిన్ లీడ్‌గా చేస్తున్నా, సెకండ్ హీరోయిన్ కాదు. ఇది నా తొలి తెలుగు సినిమా. ఈ ప్రాజెక్ట్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నా` అని తెలిపింది మాళవిక మోహనన్. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాపై హింట్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ అద్భుతమైన సినిమా చేస్తున్నానని చెప్పింది. అది ప్రభాస్ దే అని వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు, అందులో తాను సెకండ్ హీరోయిన్ కాదని మెయిన్ లీడ్‌గానే చేస్తున్నట్టు వెల్లడించింది. పరోక్షంగా ఆమె ప్రభాస్ సినిమాని కన్ఫమ్ చేసిందని చెప్పొచ్చు. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.
మాళవిక మోహనన్.. `మాస్టర్`, `మారన్` చిత్రాలతో మెప్పించింది. కానీ కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. పెద్ద ఆఫర్లు కూడా రావడం లేదనే టాక్ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే నెమ్మిదిగా పుంజుకుంటుందీ బోల్డ్ బ్యూటీ. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో ప్రభాస్‌తో సినిమా చేస్తుంది. మరోవైపు హిందీలో రెండుప్రాజెక్ట్ లున్నాయి. మలయాళంలో `క్రిస్టీ` అనేసినిమా చేసింది. ఇలా బిజీగానే ఉందీ భామ. కానీ పెద్ద ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది.