టీనేజ్‌ నుంచి వృద్ధాప్యం వరకు ఓ మహిళా జర్నీని తెలిపే `అమ్మ దీవెన`ః ఆమని

Published : Jan 25, 2021, 07:47 PM IST
టీనేజ్‌ నుంచి వృద్ధాప్యం వరకు ఓ మహిళా జర్నీని తెలిపే `అమ్మ దీవెన`ః ఆమని

సారాంశం

ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `అమ్మ దీవెన`. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో, లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మిస్తున్నారు. మదర్‌ సెంటిమెంట్‌తో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఆమని మీడియాతో ముచ్చటించింది. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

``శుభసంకల్పం` తర్వాత `అమ్మ దీవెన` సినిమాలో డీ గ్లామర్‌ పాత్ర పోషించానని అంటోంది నటి ఆమని. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `అమ్మ దీవెన`. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో, లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మిస్తున్నారు. మదర్‌ సెంటిమెంట్‌తో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఆమని మీడియాతో ముచ్చటించింది. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

`దర్శకుడు శివ‌ ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ముఖ్యంగా అందరిని ఆట్టుకునే విధంగా ఉంటుంది. `శుభ‌సంక‌ల్పం` తర్వాత ఈ సినిమాలో డీ గ్లామ‌ర్ పాత్ర చేశాను. యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు ఓ మహిళా చేసే ప్రయాణమే ఈ సినిమా. ఐదుగురు పిల్లల తల్లి వాళ్ళను ప్రయోజకుల్ని చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు  ఎదుర్కొంది. సమాజం నుండి ఎదురైనా కష్ట నష్టాలను ఎలా అధిగమించింది. తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది. కష్ఠాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్య తో జీవితాన్ని ముగించకూడదు అని చెప్పే మంచి సందేశం ఈ సినిమా ద్వారా అందించాం` అని చెప్పింది. 

ఇంకా చెబుతూ, `ఈ కథ మొత్తం నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పోసాని కృష్ణ మురళి  ఓ వ్యక్తిగా చక్కగా నటించారు. అలాగే దర్శకుడు శివ కూడా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. తప్పకుండా ఇది అందరికి నచ్చే సినిమా. కెరీర్ పరంగా చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. ఇంతమంచి చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అప్పుడే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ, `ఆమని గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించారు. నటిగా ఆమె ఎన్ని భిన్నమైన పాత్రల్లో మెప్పించారో అందరికి తెలుసు. మా `అమ్మ దీవెన` సినిమాలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమాతో ఆమెకు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది. తల్లి ప్రేమ గురించి గొప్పగా చెప్పే చిత్రమిది` అని చెప్పారు.  `ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గర చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంద`ని ద‌ర్శ‌కుడు  శివ ఏటూరి చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?