బిగ్‌బాస్‌4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ మొక్కలు నాటింది..ఎవరిని నామినేట్‌ చేసిందంటే?

Published : Jan 25, 2021, 06:30 PM IST
బిగ్‌బాస్‌4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ మొక్కలు నాటింది..ఎవరిని నామినేట్‌ చేసిందంటే?

సారాంశం

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మోనాల్‌ గజ్జర్‌..తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. దేత్తడి హారిక విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ని స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటింది.

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మోనాల్‌ గజ్జర్‌..తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. దేత్తడి హారిక విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ని స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటింది. జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ నుంచి ప్రేరణ తీసుకుని సవాల్‌ని స్వీకరించి మొక్కలు నాటినట్టు తెలిపింది మోనాల్‌. `అడవులను, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్‌ కుమార్‌ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్‌ సిండియా ఛాలెంజ్‌ అని తెలిపింది. ఈ సందర్భంగా మరో నలుగురిని నామినేట్‌ చేసింది. మాకప ఆనంద్‌, మిత్ర గాద్వి, క్రిష్ణ కుల్‌ శేఖరన్‌, మల్హాత్‌ థాకర్‌లను నామినేట్‌ చేసింది. మొక్కలు నాటాలని చెప్పింది. 

ఇక బిగ్‌బాస్‌ పూర్తయిన తర్వాత స్టార్‌ మాలో ఆఫర్‌ కొట్టేసింది మోనాల్‌. `డాన్స్ ప్లస్‌` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల `అల్లుడు అదుర్స్` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. అలాగే తన హౌజ్‌ ప్రియుడు అఖిల్‌తో మరింత సన్నిహితంగా ఉంటూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?