సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

By sivanagaprasad kodatiFirst Published Oct 21, 2018, 10:52 AM IST
Highlights

సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బాబాయ్-అబ్బాయ్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన వైజాగ్ ప్రసాద్ అనేక సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు.

తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ తండ్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రసాద్ గారు సినీ రంగంలో చాలా బిజీ అయ్యారు. దాదాపు 170కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ స్నేహపూర్వకంగా వైజాగ్ ప్రసాద్ అని పిలిచేవారు.  

ఆయన స్వస్థలం వైజాగ్ కావడంతో ఆ విధంగా పిలిచేవారు. ప్రసాద్ గారికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఇద్దరు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. వైజాగ్ ప్రసాద్ మృతి చెందడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  

click me!