7.5 కోట్లు మోసపోయానంటూ నరేష్ పోలీస్ కంప్లైంట్

Surya Prakash   | Asianet News
Published : Apr 18, 2021, 03:06 PM IST
7.5 కోట్లు మోసపోయానంటూ నరేష్ పోలీస్ కంప్లైంట్

సారాంశం

సినీనటుడు నరేష్ బిజినెస్ లో ఏకంగా 7.5 కోట్ల వరకు పెట్టి మోసపోయాడు.ఈ విషయాన్ని ఆయనే పేర్కొన్నారు.


కష్టపడి దాచుకున్న సొమ్ముని పోగొట్టుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులోనూ ఒకటా రెండా దాదాపు పది కోట్లు పోగట్టుకున్న వారి పరిస్దితి ఏమిటి..రీసెంట గా బెంగుళూరులో హీరోయిన్ నిక్కీ గల్రానీ ఒక హోటల్ కోసం పెట్టుబడి పెట్టి 50 లక్షల రూపాయిలు మోసపోయింది.ఇప్పుడు అలాంటి మోసమే సీనియర్ నటుడు నరేష్ కి కూడా ఎదురైంది.

సినీనటుడు నరేష్ బిజినెస్ లో ఏకంగా 7.5 కోట్ల వరకు పెట్టి మోసపోయాడు.ఈ విషయాన్ని ఆయనే పేర్కొన్నారు.  ఈ విషయమై నరేశ్‌ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్‌ తమకు రూ.10 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులకు తెలిపారు.

 ‘‘స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీల పేరుతో లింగం శ్రీనివాస్‌ .. మా బిల్డర్స్‌ ఫియోనిక్స్‌తో అసోసియేట్‌ అయి సైనింగ్‌ అథారిటీగా ఉన్నాడు. మా కుటుంబంతో ఉన్న  పరిచయంతో రూ.7.5కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఆరేళ్లు దాటినా ఇప్పటి వరకు తిరిగి చెల్లించలేదు. దీనిపై మూడ్రోజుల క్రితం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మాకు రూ.10 కోట్లు రావాలి. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ఓ వీడియో లో నరేశ్‌ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Silk Smitha: చనిపోయే ముందు సిల్క్ స్మిత ఫోన్ చేసింది, నేను వెళ్లి ఉంటే బతికేదేమో.. సీనియర్ నటి ఆవేదన
కృష్ణ, ఎన్టీఆర్ నుంచి రాంచరణ్, రవితేజ వరకు.. క్రేజీ హీరోలు ప్రాణం పెట్టి నటించిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు