మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా టీంకి కూడా కరోనా షాక్ ఇచ్చిందని సమాచారం.
సెకండ్ వేవ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడింది. కోట్లతో నడిచే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ సినిమా రంగంపై భారీగా ఉంది. ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఈ నేపధ్యంలో మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా టీంకి కూడా కరోనా షాక్ ఇచ్చిందని సమాచారం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా టీం మెంబర్స్ లో ఆరుగురికి కరోనా సోకింది. దాంతో, షూటింగ్ ఆపేశారు. టీమ్ లో అందరూ కొన్నాళ్ళూ ఐసోలేషన్ కి వెళ్తున్నారు. దాంతో వారంతా రికవరీ అయ్యాక షూటింగ్ లు మొదలెడతారు. దాంతో అసలు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్లాన్ చేసుకున్న డేట్ కి పూర్తి అవుతుందా లేదా అన్న సందేహం అందరిలో ఉంది. అమెరికాలో షూట్ చేద్దామంటే కుదరలేదు. హైదరాబాద్ లో మొదలెడితే ఇక్కడా కరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్ లో గత సంవత్సరం కన్నా ఈ సారి కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సినిమావాళ్లను ఈ సారి చుట్టేస్తోంది. దాంతో ఈ కరోనా కేసులు షూటింగ్ షెడ్యూల్స్ ని బాగా డిస్ట్రబ్ చేసేస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ సినీ పరిశ్రమ ఇలాంటి దారుణమైన పరిస్దితిని ఎదుర్కొనలేదు. సీనియర్ ఆర్టిస్ట్ లు వచ్చి షూటింగ్ లో పాల్గొనాలంటే భయపడిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట కరోనా తగులుకుంటోందనే భయం వేధిస్తోంది.
బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.