Dharmendra: ఆసుపత్రిలో సీనియర్ నటుడు ధర్మేంద్ర 

Published : May 01, 2022, 10:24 PM IST
Dharmendra: ఆసుపత్రిలో సీనియర్ నటుడు ధర్మేంద్ర 

సారాంశం

బాలీవుడ్ మొదటి తరం సూపర్ స్టార్ ధర్మేంద్ర అనార్యోగంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra)ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ధర్మేంద్ర ఐసీయూలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు స్పందించారు. 

ధర్మేంద్ర నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగైంది. నేడు డీఛార్జ్ కావచ్చు.. అంటూ తెలియజేశారు. ధర్మేంద్ర గురించి కుటుంబ సభ్యుల సమాచారం నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక చాలా కాలంగా ధర్మేంద్ర వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఆయన మేకప్ వేసుకొని ఏళ్ళు గడచిపోతుంది. అయితే కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. రన్బీర్ కపూర్- అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే