Keerthy Suresh: డబ్బింగ్ డన్ అంటున్న కీర్తి పాప... సూపర్ ఎక్సయిట్మెంట్ లో ఉందట 

Published : May 01, 2022, 10:00 PM ISTUpdated : May 01, 2022, 11:00 PM IST
Keerthy Suresh: డబ్బింగ్ డన్ అంటున్న కీర్తి పాప... సూపర్ ఎక్సయిట్మెంట్ లో ఉందట 

సారాంశం

మరో రెండు వారాల్లో సూపర్ స్టార్ మహేష్ సందడి థియేటర్స్ లో మొదలుకానుంది. ఈ క్రమంలో టీమ్ చకచకా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. 

మహేష్ (Mahesh Babu)మూవీ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. 2020లో సరిలేరు నీకెవ్వరు మూవీతో అలరించిన మహేష్... రెండేళ్లు గ్యాప్ ఇచ్చాడు.  అనుకోని కారణాల వలన సర్కారు వారి పాట మరింత ఆలస్యమైంది. ఇక 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మొదటి ప్రకటించి, సమ్మర్ కి వాయిదా వేశారు. మే 12న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది.దీంతో నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా పూర్తి చేస్తున్నారు. 

ఈ క్రమంలో కీర్తి సురేష్(Keerthy Suresh) డబ్బింగ్ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దగ్గరుండి కీర్తి సురేష్ చేత డైలాగ్స్ చెప్పించారు. ఇక డబ్బింగ్ చెబుతున్న కీర్తి ఫోటోలు షేర్ చేశారు. డబ్బింగ్ ఫైనల్ టచ్ పూర్తి చేసినట్లు కామెంట్ చేశారు. అలాగే సర్కారు వారి పాట చిత్రం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఆమె తన ఫీలింగ్ పంచుకున్నారు. కెరీర్ లో మొదటిసారి కీర్తి సురేష్ మహేష్ తో జత కడుతున్నారు. ఇక చాలా కాలంగా కీర్తి సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. 

కాగా మహేష్ ప్రస్తుతం పారిస్ టూర్ లో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఫారిన్ వెళ్లడం జరిగింది. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)చిత్ర ప్రమోషన్స్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. కావున ఆయన త్వరగానే ట్రిప్ పూర్తి చేసుకొచ్చే ఆస్కారం కలదు. దర్శకుడు పరశురామ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. 

మహేష్ లుక్ పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆయన యాటిట్యూడ్, మేనరిజం ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అన్న మాట వినిపిస్తోంది. ఇక థమన్ సాంగ్స్ మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. విడుదలైన మూడు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. కళావతి సాంగ్ ఏకంగా 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఇక మే 2న సర్కారు వారి పాట ట్రైలర్ (Sarkaru Vaari Paata Trailer)విడుదల కానుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..