Vishwak Sen: పబ్లిక్ లో విశ్వక్ సేన్ న్యూసెన్స్... ఫ్రాంక్ వీడియోపై జనాలు సీరియస్!

Published : May 01, 2022, 09:02 PM IST
Vishwak Sen: పబ్లిక్ లో విశ్వక్ సేన్ న్యూసెన్స్... ఫ్రాంక్ వీడియోపై జనాలు సీరియస్!

సారాంశం

హీరో విశ్వక్ సేన్ చేసిన పనికి జనాలు సీరియస్ అవుతున్నారు. ఇదేం పత్యం అంటూ తిట్టిపోస్తున్నారు . మూవీ ప్రమోషన్ కోసం పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏంటంటున్నారు.   

సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్స్ వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేయడం. స్వయంగా పోస్టర్స్ అతికించడం. ఫుట్ ఫాత్ పై వస్తువులు, ఫుడ్ అమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంచెం భిన్నంగా ప్రయత్నించడం ద్వారా జనాల అటెన్షన్ రాబట్టొచ్చని, తద్వారా మూవీకి కలెక్షన్స్ దక్కుతాయనేది వారి భావన. అయితే చేసే పని ఎవరినీ ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. కాగా హీరో విశ్వక్ సేన్ చేసిన ఈ తరహా ప్రయోగం బెడిసి కొట్టింది. 

విశ్వక్ సేన్ (Vishwak Sen)లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం. మే 6న ఈ మూవీ విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కోసం పబ్లిక్ లో చిన్న ప్రయోగం చేశారు. హెవీ ట్రాఫిక్ కలిగిన రోడ్డులో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా విశ్వక్ సేన్ అపుతున్నాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీలోని  విశ్వక్ సేన్ రోల్ నేమ్ అయిన అర్జున్ కుమార్ అల్లం ఎక్కడా? అంటూ ఆ వ్యక్తి నానా హంగామా చేశాడు. 33 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు అంటూ రోడ్డుపై పడి దొర్లాడు. విశ్వక్ సేన్ అతడ్ని వారిస్తూ ఉండగా.. పబ్లిక్ ఒక్కసారిగా గ్యాదర్ అయ్యారు. 

సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ చేసిన ఈ ఆత్మహత్యా ఫ్రాంక్ వీడియో పబ్లిక్ ని ఇబ్బంది పెట్టింది. దీని వలన ఏర్పడిన అసౌకర్యానికి జనాలు మండిపడుతున్నారు. పబ్లిక్ లో న్యూసెన్స్ చేసిన విశ్వక్ సేన్ అనుకోకుండా నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ టీమ్ ఫ్రాంక్ వీడియో వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్ కోసం బిన్నంగా ఆలోచిండడంలో తప్పులేదు, కానీ ఇలా పబ్లిక్ ని ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదని పలువురి అభిప్రాయం. 

 ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (Ashokavanamlo Arjuna Kalyanam)మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో  విశ్వక్ పెళ్లి కాని ఏజ్ బార్ ఫెలోగా కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఈ చిత్రంలో రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించారు. విద్యాసాగర్‌ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా