‘ఎనిమిదేళ్లు ఆయన దగ్గరే ఉన్నాం’.. రాకేశ్ మాస్టర్ పెద్దకర్మలో శేఖర్ మాస్టర్ భావోద్వేగం..

By Asianet News  |  First Published Jun 28, 2023, 4:49 PM IST

రాకేష్ మాస్టర్ పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఆయన ప్రియ శిష్యుడు శేఖర్ మాస్టర్ వచ్చి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగమయ్యారు. తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చారు. 
 


ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master)  ఈనెల 18న సన్ స్ట్రోక్ కు గురై చనిపోయిన విషయం తెలిసిందే. విజయనగరంలో షూటింగ్ కోసం వెళ్లిన ఆయన వడదెబ్బ తాకడం, అప్పటికే మద్యం సేవించి ఉండటంతో విరేచనాలు, రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి విషమించి మరణించారు. రాకేష్ మాస్టర్ మరణ వార్తను అందరినీ బాధించింది. ముఖ్యంగా డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు చింతించారు. ఆయన స్టూడెంట్లు శేఖర్, జానీ, గణేష్, పలువురు డాన్సర్లు అంత్యక్రియల్లోనూ పాల్గొన్న విషయం తెలిిసందే. 

ఈ రోజు రాకేశ్ మాస్టర్ పెద్దకర్మకు సంబంధించిన కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గతంలో ఆయన గురువుతో గొడవలు అంటూ వచ్చిన వాటికి సమాధానం ఇచ్చారు. మాస్టర్ తో ఎంత మంచి అనుబంధంతో ఉండేదో చెప్పుకొచ్చారు. 

Latest Videos

undefined

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ తో నా జర్నీ ఎనిమిది సంవత్సరాలు. మాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. మాస్టర్ గారే మమ్మల్ని తీసుకొచ్చారు. బయటి ప్రపంచం అంటేఏంటో మాకు అప్పుడు తెలియదు. నేను, సత్య మాస్టర్ వద్దకు వచ్చాం. మేం విజయవాడలో నేర్చుకొని వచ్చామని చెప్పాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మొన్నటి వరకు యూట్యూబ్ లో మీరు చూసిన డాన్స్ జస్ట్ ఐదు శాతం మాత్రమే.  ఆయన చాలా మంచి డాన్సర్. ఆయన స్టైల్ చాలా ప్రత్యేకం. 

నేను మొదట ప్రభుదేవను చూసి స్ఫూర్తి పొందాను. ఇక హైదరాబాద్ కు వచ్చాకా రాకేష్ మాస్టర్ ఇన్ స్పైర్ చేశారు. ఎప్పుడు కొరియోగ్రఫీ చేసినా అందరి మూవ్స్ ఒకేలా వచ్చేంత వరకు వదిలిపెట్టేవారు కాదు. ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. చాలా మంది అభిమానులు కూడా నివాళి అర్పిస్తున్నారు. 

బయటి వాళ్లకు ఎక్కువగా తెలియదంటి. మేం బయటకి కూడా వెళ్లే వాళ్లం కాదు. ప్రతి క్షణం ఆయనతోనే గడిపాం. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది కూడా మేమే. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు మాత్రం తెలిసీతెలియంది రాస్తున్నారు. ఆయనతో మేం చాలా బాగున్నాం. మాస్టర్ ఎక్కడున్న హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ స్పీచ్ వైరల్ గా మారింది. 

click me!