
ఎపిసోడ్ ప్రారంభంలో వీళ్లంతా ఇంటి పరువు గురించి ఆలోచించి ఈ బరువుని మోసుకొచ్చారు. కానీ నువ్వెందుకు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టావు అంటుంది అపర్ణ. నిజమే మమ్మీ తాళి కట్టి ఉండకూడదు కానీ నేను ఎప్పుడూ ఏ అమ్మాయిని ఇష్టపడలేదు అలాంటిది ఇష్టపడ్డాను కానీ తను నన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది అనుకోలేదు. నేను ఇష్టపడ్డానని నాకోసం మీరందరూ దిగివచ్చి ఈ సంబంధాన్ని ఖాయం చేశారు.
అలాంటిది నేను ఆ ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అంటే, అది నాకు నేను జీవితాంతం విధించుకున్న శిక్ష అంటాడు రాజ్. మీరు నా వల్లనే బలైపోయారు దానికి బాధ్యతగా నాకు నేను వేసుకున్న శిక్ష అంటాడు రాజ్. నువ్వు వేసుకున్న ఈ శిక్షణ చూసి నేను జీవితకాలం భరించలేను ఇప్పుడే దీన్ని బయటికి పంపించేస్తాను అంటూ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు ఉందా నువ్వు ఎప్పటికీ నా కొడుక్కి భార్యని కాలేవు.
ఈ ఇంటికి కోడలివి కాలేవు అంటూ కావ్య ని బయటికి పొమ్మంటుంది అపర్ణ. మరోవైపు జరిగిందంతా తలుచుకుంటూ బాధపడుతుంది కనకం దంపతులు. కావ్యని కట్టుబట్టలతో పంపించాను, తనని తలా ఒక మాట అని హింసిస్తున్నారేమో. పెద్దది పోయి బాగానే ఉంది అక్క నగలు కూడా తీసుకుపోయింది ఎక్కడ ఉందో అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
దిగులుగా ఉన్న కృష్ణమూర్తిని చూసి ఆకలిగా ఉందా వంట చేస్తున్నాను అంటూ కూరగాయలు తరుగుతుంది కానీ కళ్ళు తిరుగుతున్నాయి అనడంతో ఆమె తోటి కోడలు వచ్చి నేను చేస్తాను అంటూ ఆమెని పక్కన కూర్చోబెడుతుంది. అదే సమయంలో మా పెద్దక్క చచ్చిపోయింది 10 రోజుల్లో దానికి దినం పెడతాను అంటూ అప్పు ఫోన్లో మాట్లాడడం వింటుంది కనకం.
పోయిందాని గురించి ఎందుకలా మాట్లాడుతావు అంటుంది. పళ్ళు రాలగొడతాను అంటూ ఆమె మీద కోప్పడతాడు ఆమె భర్త. ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావా, ఎంత తలవొంపులు తీసుకువచ్చింది అంటూ బాధపడతాడు. నిజమే దానికోసం ఎంత చేశాను చివరికి నా నోట్లో మెట్టు కొట్టి పోయింది అంటే నీకు మంచి శాస్తి చేసి పోయింది అంటాడు కృష్ణమూర్తి. నిజమే నాకు కావాల్సిందే.
కావ్య సంపాదన అంతా దాని బొంద మీద కొట్టేదాన్ని అంటూ బాధపడుతుంది. ఆ కారు ఎవరిది కార్లు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతుంది కనకం. ఎవడు ఉంటే మనకెందుకు ఇంకా దాని గురించి మాట్లాడుతున్నావ్ ఎందుకు అంటూ తల్లిని కోప్పడుతుంది అప్పు. దానివల్లే కావ్య అక్క రాజ్ ని చేసుకోవాల్సి వచ్చింది. దాని జీవితాన్ని నువ్వే నాశనం చేసావు అంటుంది అప్పు.
నేను సగం చచ్చాను నన్ను ఏమీ అనకండి అంటుంది కనకం. ఆ సగం మాత్రం ఎందుకు బ్రతికావు కానీ జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ఎంత బ్రతిమాలేను వినలేదు అప్పుడు చస్తానని బెదిరించావు ఇప్పుడు కూడా బెదిరిస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా అంటూ కోప్పడతాడు కృష్ణమూర్తి. నన్ను తిడితే తిట్టారు కానీ అది గొప్ప ఇంట్లో పడింది కదా అంటుంది కనకం.
నోరు ముయ్యి అది గొప్పిళ్లు ఏంటి అందులో సకానికి పైగా మన కావిని నానా మాటలు అనేవాళ్లే, దీనికి అందరికీ కారణం మీ పెద్ద కూతురు. అప్పు అన్నట్లు నేను తల స్నానం చేసి పదో రోజున దానికి దినం పెడతాను అంటాడు కృష్ణమూర్తి. అలా మాట్లాడడం తప్పు అంటుంది కనకం తోటి కోడలు. దాన్ని నువ్వు వెనకేసుకొరాకు నీవు వాళ్ళ వల్లే నువ్వు కావ్యక్క పెళ్లిచూడలేకపోయావు అంటుంది అప్పు.
అలా ఏమీ కాదమ్మా, అబ్బాయి వాళ్ళు ప్రతిదీ హారతీస్తున్నారు అక్కడికి వస్తే లేనిపోని తలనొప్పని నేనే రాలేదు అంటుంది వాళ్ల పెద్దమ్మ. స్వప్న ఎక్కడున్నావ్ బాగుందని తెలిస్తే చాలు అంటుంది కనకం. ఇంకోసారి దాని పేరు ఎత్తితే బాగోదు అంటూ భార్యని హెచ్చరిస్తాడు కృష్ణమూర్తి. మరోవైపు నువ్వు ఈ ఇంట్లో పాదం మోపటానికి అనుమతి లేదు ఇది పవిత్రమైన ప్రాంగణం ఇక్కడ మోసానికి తావులేదు అంటుంది అపర్ణ.
నీ పాదాన్ని మోపి అపవిత్రం చేయకుండా అట్నుంచి అంటే బయటికి వెళ్ళు అంటుంది. కష్టపడి పెళ్లి చేస్తే వదిన తనని బయటకు పంపించేసేలాగా ఉంది కంచు లాంటి కోడలు వస్తుందనుకుంటే ఈ పెళ్లేంటి ఏమీ మాట్లాడటం లేదు అనుకుంటుంది రుద్రాణి. నువ్వు చదువుకున్న దానివి గొప్ప నుంచి వచ్చిన దానికి నువ్వు ఇలాగేనా ప్రవర్తిస్తావు అంటూ వదినని మందలిస్తుంది రుద్రాణి.
ఇంట్లో అందరూ కలిసి ఈ పెళ్లి చేశారు. బంధువులు అందరూ ఈ పెళ్లి చూసారు ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వు గుమ్మం లోంచి బయటికి వెళ్ళగొడితే నీ అహం చల్లారుతుందేమో కానీ ఎంత అభివృద్ధిస్టాప్ వస్తుందో తెలుసా అంటుంది రుద్రాణి. అప్రతిష్ట అదృష్టం అని పెళ్లికూతురు రూపంలో వచ్చింది. నా కొడుకు సుఖాన్ని సంతోషాన్ని నూరేళ్ల జీవితాన్ని ఈ పిల్ల కొంగున కట్టుకొని తిరుగుతుంటే అది నేను భరించాలా అంటూ కావ్యని బయటికి నెట్టెయ్యబోతుంది అపర్ణ.
ఇంతలో వాళ్ళ మామగారు లేచి ఆమెని పెళ్లంటే మీ దృష్టిలో అంత చులకన అయిపోయిందా అక్కడ మండపంలో కోటి మంది దేవతలు ఆవాహన జరిగింది. అగ్నిసాక్షిగా నీ కొడుకు ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు. పురోహితుడు వేదమంత్రాలు చదివి వాళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేశాడు. బ్రహ్మముడి విప్పడం అనేది సాధ్యమా. దేవతలు ఆశీర్వదిస్తే తప్ప ఏ పెళ్లి జరగదు అది గుర్తుపెట్టుకో అంటూ అపర్ణకి చివాట్లు పెడతాడు.
ఇప్పుడు గొడవ చేసి ఈ లాభం. పెళ్లిచూపులు కెళ్ళి నిశ్చితార్థం చేసుకొని వచ్చారు. పెళ్లికి, పెళ్లి చూపులకి కనీసం పది రోజులు కూడా టైం లేకుండా ముహూర్తం నిర్ణయించేశారు తీరా చూస్తే ఆ అమ్మాయి అబ్బాయి నచ్చలేదంటూ వెళ్ళిపోయింది. ఈ పెళ్లి కూడా గత్యంతరం లేక జరిగింది మాత్రమే అంటాడు సుభాష్. దుగ్గిరాల వారి ఇంటి కోడల్ని బయటికి వెళ్ళగొడితే ఆ ప్రతిష్ట మనకే హారతి ఇచ్చి లోపలికి తీసుకురా అంటాడు సుభాష్.
మీరు ఎంత చెప్పినా నాకు ఈ విషయం మింగుడు పడటం లేదు నేను లేని సమయంలో నా కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేశారు. అరిష్టానికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురావడం నా వల్ల కాదు అంటుంది అపర్ణ. ఆ అమ్మాయి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది ధనలక్ష్మి. అంతా ఇష్టం లేని అమ్మాయి ఇక్కడ వరకు ఎలా వచ్చింది పరువు కోసమే కదా అది కల్యాణ మండపంలో పెళ్లికూతురు వెళ్ళిపోయినప్పుడే పోయింది.
ఇప్పుడు కొత్తగా పోయేదేముంది దయచేసి ఆమెని పంపించండి అంటుంది అపర్ణ. ఆమె మాటలకి అడ్డువచ్చిన కావ్య నేను ఇలాగ మాట్లాడుతున్నందుకు క్షమించండి నేను బిక్షపాత్ర పట్టుకుని మీ ఇంటి ముందు నిలబడలేదు. అలాగని వెనక్కి తిరిగి వెళ్లిపోను లేను. నేను మా అక్క స్థానంలో కూర్చున్న మాట నిజమే కానీ ఎంత నరకం అనుభవించాను మీకు తెలీదు.
నన్ను శత్రువులాగా చూస్తున్న మీ అబ్బాయిని నేను ద్వేషించే మీ అబ్బాయిని మోసం చేస్తున్నానని భావనతోనే తాళి కట్టే సమయంలో ముసుగు తీసేసాను. నేను ఎవరినో అందర్నీ తెలిసేలాగా చేశాను. పెళ్లి జరగడానికి వీలు లేదు అంటూ కచ్చితంగా చెప్పాను. అయినా ఈ పెళ్లి జరిగింది మీ అబ్బాయి స్వయంగా మూడు ముళ్ళు వేశారు. ఇప్పుడు మీ అబ్బాయి ఒప్పుకోకపోయినా నేను ఆయనకి భార్యనే అంటుంది, ఈ ఇంటికి కోడల్ని అంటుంది కావ్య.
అయినా ఇప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను అది నా తల్లిదండ్రులకి తలవొంపులు తీసుకొస్తుంది. గడప దాటి బయటికి వెళ్లడం అనేది అటు పుట్టింటికి అత్తింటికి గౌరవం కాదు. చావో,బ్రతుకో నేను మీ ఇంట్లోనే ఉంటాను. నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను అంటుంది కావ్య. ఇంక ఆపు గుమ్మంలో అడుగు పెట్టకుండానే నిర్ణయాలు చెప్పే స్థాయికి ఎదిగిపోయావా.
నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తానని ఎలా అనుకున్నావు ఇక్కడ నుంచి వెళ్ళు అంటూ కావ్యని నెట్టేయ్య బోతుంది అపర్ణ. ఆవేశంలో తప్పొప్పులు మర్చిపోతున్నావు దయాదక్షిణలు లేకుండా ప్రవర్తిస్తున్నావు. కొత్త కోడలు మహాలక్ష్మితో సమానం అందుకే ఆమెతోనే దీపం వెలిగిస్తాము. ఆ దీపం రూపంలో ఈ ఇంటిని కాపాడుతుందని ఆశిస్తాం. అలాంటి కొత్త కోడల్ని కాళ్ల పారాణి తో, మంగళసూత్రంతో, ఐదోతనంతో, ఇంటికి వస్తే నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అంటూ కోడలికి చివాట్లు పెడతాడు సీతారామయ్య.
తరువాయి భాగంలో అందరూ నువ్వు తప్పు చేయలేదని మీ కుటుంబం వాళ్ళు మాత్రమే తప్పు చేశారని అంటున్నారు అందుకని నువ్వు నీ కుటుంబంతో ఇకమీదట సంబంధం బాంధవ్యాలు కొనసాగించడానికి వీల్లేదు అంటుంది అపర్ణ.ఈ ఇంటి కోడలుగా ఉండాలి అంటే పుట్టింటి బాంధవ్యాన్ని తెంచుకోగలవా అంటుంది అపర్ణ. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య.