సీఎం పవన్ కళ్యాణ్ .. నా ఫ్రెండ్ అని చెప్పుకునే రోజు రావాలి, డైరెక్టర్ ఎస్ జే సూర్య కామెంట్స్

Published : Mar 11, 2023, 01:16 PM ISTUpdated : Mar 11, 2023, 01:20 PM IST
సీఎం పవన్ కళ్యాణ్ .. నా ఫ్రెండ్ అని చెప్పుకునే రోజు రావాలి, డైరెక్టర్ ఎస్ జే సూర్య కామెంట్స్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ఉంది అని మనసులో మాట బయట పెట్టారు తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య.  సూర్య ఆ కామెంట్స్ ఎందుకు చేశారు..? కారణం ఏంటి..? 

పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ అంటే అభిమానించనివారు ఉండరు. ఆయన కోసం సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ.. అభిమానిస్తారు. ఎంతో మంది పవన్ మంచి మనసును ప్రేమిస్తారు. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని రకరకాలుగా వెల్లడిస్తుంటారు ఫ్యాన్స్. ఈక్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ పై మన అభిమానాన్ని చాటుకున్నారు తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు సూర్య. ఈసినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక ఆతరువాత చాలా ఏళ్ళకు వీరి కాంబోలో వచ్చి పులి  సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే వీరిద్దరు పర్సనల్ గా చాలా మంచి స్నేహితులు. ఒకరిపై మరొకరు తమఅభిమానానని చాలా సార్లు వ్యాక్త పరచుకున్నారు కూడా.  పవన్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఎస్ జె సూర్య చాలా సందర్భాల్లో చెప్పారు. 

ఇక పవన్ కళ్యాణ్ 27 ఏళ్ళ సినిమా కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. అంతే కాదు 10 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కూడా పూర్తి చేసుకున్నారు పవర్ స్టార్. ఈక్ర మంలో చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే దర్శకుడు సూర్య పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సూర్య ఏమనమనారంటే... పవన్ కళ్యాణ్ గారు  తెరపైనే కాదు పొలిటికల్ గాను ఒక గ్రేట్ లీడర్. ప్రజలు కోసం మీరు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు.

 

అంతే కాదు ఇది కేవలం నా ఒక్కడి కోరక ఏమాత్రమూ కాదు.. ఇది ఎంతోమంది కల కూడా. ఇలాంటి ఆశీర్వాదాలు చాలా తక్కువమందికి దొరుకుతాయి. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మరియు రాజకీయాల్లో గ్రేట్ లీడర్ ఎంజీఆర్ కూడా అలాంటి వ్యక్తే. పవన్ గారు గురించి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు ఎంజీఆర్ గారే గుర్తుకు వస్తారు. సినిమాల్లో చరిష్మా, రాజకీయాల్లో వాళ్ళ ఆలోచనలు అవన్నీ పుట్టకతో వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల  వైరల్ అవుతుంది. జనసేన అఫీషియల్ సోషల్ మీడియాపేజ్ లో ఈ వీడియో దర్శనం ఇస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా