Sayyeshaa Arya : టైటానిక్ స్టిల్ లో ‘సయేష - ఆర్య’.. ఫొటోను షేర్ చేసిన సయేష..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 28, 2022, 02:22 PM IST
Sayyeshaa Arya : టైటానిక్ స్టిల్ లో ‘సయేష - ఆర్య’.. ఫొటోను షేర్ చేసిన సయేష..

సారాంశం

తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సయేషా ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట వెకేషన్ లో భాగంగా  ఓ బోట్ పై  దిగిన ఫొటోను షేర్ చేసింది సయేష..   

మూడేండ్ల కింద తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సయేషా ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకలకు అటు తమిళం, ఇటు తెలుగు సినీ ప్రముఖులు హాజరై ఈ జంటను ఆశీర్వదించింది.  టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’, తదితరులు హాజరై విషేస్ తెలియజేశారు. అయితే ఈ జంట వివాహాం అయినప్పటి నుంచి  అనోన్యంగా జీవిస్తోంది. 

అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ మూవీలో సయేష ‘దివ్య’ పాత్రలో నటించి టాలీవుడ్ కు, గ్లామర్ ఫీల్డ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లింది సయేష. అక్కడ ఒక్క మూవీలో మెరిసిందీ హీరోయిన్. తర్వాత 2017 నుంచి మొత్తంగా తమిళంలోనే వరుస మూవీలు చేస్తోంది సయేష. గతేడాది కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ మూవీలోనూ సయేష తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. 

 

అయితే, ఈ జంట గతంలో వేకేషన్ కు స్పెయిన్ లోని బాలేరిక్ సముద్ర పరిధిలోని ఒక ఐలాండ్ అయిన ‘ఐబిజా’కు  వెళ్లారు.  అక్కడ ఓ బోటుపై సయేష-ఆర్య హాలీవుడ్ మూవీ ‘టైటానిక్’లోని సీన్ ను రిపీట్ చేశారు. సేమ్ అదే తరహాలో స్టిల్ ఇచ్చి అదరగొట్టారు. ఈ పొటోను సయేష తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొంది. 

 ఆర్య కూడా తెలుగు ప్రేక్షకులకు ‘వరుడు’ మూవీతో పరిచమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘రాజా రాణి’, ‘సైజు జీరో’, ‘నేనే దేవుడ్ని’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో పోషించి మెప్పించారు.  ఈ ఏడాది కూడా ఆర్య తమిళంలో నటించిన మరిన్ని సినిమాలు విడుదల కానున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అభిమానులకు పెళ్లి గిఫ్ట్? విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఎంత పెద్ద సాయం చేశాడో తెలుసా? !
Allu Arjun: సీనియర్ నటుడిపై చేయి చేసుకున్న అల్లు అర్జున్.. తప్పు తెలుసుకున్న వెంటనే