Anchor Himaja:సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, నన్ను అడిగేవాడే లేదు... విడాకుల రూమర్స్ పై యాంకర్ హిమజ!

By Sambi ReddyFirst Published Jan 28, 2022, 1:42 PM IST
Highlights

యాంకర్ కమ్ నటి హిమజ (Anchor Himaja)విడాకుల వార్తలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అసలు విషయం తెలియజేశారు. సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా... నన్ను ఆపేవాడు ఎవరూ లేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 


ఇంస్టాగ్రామ్ లో వీడియో విడుదల చేసిన హిమజ... యూట్యూబ్ లో వీడియోలు చూసి ఫ్రెండ్స్ వెల్ విషర్స్ కాల్ చేశారు. కొన్ని లింక్స్ షేర్ చేశారు. హిమజకు విడాకులు అంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. రియాక్ట్ కావాలి అంటూ మెసేజ్ లు పంపుతున్నారు. సాధారణంగా నేను ఇలాంటి రూమర్స్ పై స్పందించను. అయితే పేరెంట్స్ బాధపడుతున్నారు. కొన్ని ఛానల్స్ యూట్యూబ్ లోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు./ నా పెళ్ళికి, విడాకులకు నన్ను కూడా పిలవండి. 

డబ్బులు ఇచ్చి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసేవాడికి బుద్ధి ఉండకపోవచ్చు. కానీ ఛానల్స్ వాళ్లకు ఉండాలిగా. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అది కూడా చాలా గ్రాండ్ గా మంచి గుడిలో, అదిరిపోయే డెకరేషన్ మధ్య గ్రాండ్ గా చేసుకుంటా. అయితే ఇప్పుడు కాదు. దానికి ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళిపోతా ఎవరినీ అడగాల్సిన పనిలేదు. ఈ మధ్య నా వీడియోలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో నాకు అండగా  నిలిచిన అందరికీ ధన్యవాదాలు... అంటూ తెలియజేశారు. 

అసలు తనకు పెళ్లి కాలేదని, విడాకులు ఎలా అవుతాయని హిమజ క్లారిటీ ఇచ్చారు. హిమజ . హిమజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో భర్త విజయ్ రెడ్డిని అన్ ఫాలో అయ్యారని, దీంతో ఆమె విడాకులు సిద్ధం అయ్యారంటూ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.అలాగే హిమజ ఫిలాసఫీ తో కూడిన కొటేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా, ఇవి పరోక్షంగా భర్తను ఉద్దేశించి అని పుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో హిమజ క్లారిటీ ఇచ్చారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himaja💫 (@itshimaja)

ఇక తన అభివృద్ధిని చూసి కొందరు కక్ష కట్టారన్న అనుమానం ఆమె వ్యక్తం చేశారు. హిమజ మాటలు చూస్తుంటే ఆ ప్రచారం చేసే వారు ఎవరో కూడా ఆమెకు తెలిసినట్లు అనిపిస్తుంది. సదరు వ్యక్తులు ఎవరైనా కానీ, వాళ్లకు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చింది హిమజ. అలాగే ఫేక్ న్యూస్ ప్రసారం చేసే యూట్యూబ్ ఛానల్స్ పై పిర్యాదు చేయాలని తన ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు.

కాగా బిగ్ బాస్ సీజన్ 3(bigg boss telugu)లో పాల్గొన్న హిమజ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె యాంకర్ గా నటిగా కొనసాగుతున్నారు. వెండితెరపై ఆమెకు అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. పేరుకు యాంకరైనా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు హిమజ. హీరోయిన్ కావాలన్న ఆమె ఆశ నెరవేరకున్నప్పటికీ సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ రాబట్టారు. 
 

click me!